RTC Strike | ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ జోక్యం అవసరం: జేఏసీ ఛైర్మన్ వెంకన్న
RTC Strike | రేపటి నుంచి చేపట్టనున్న ఆర్టీసీ సమ్మె(RTC Strike)పై రాష్ట్ర ప్రభుత్వ జోక్యం అవసరమని, ఆర్టీసీని హైదరాబాద్‌లో లేకుండా చేయాలని చూస్తున్నారని జేఏసీ చైర్మన్ వెంకన్న(JAC chairman Venkanna) విమర్శించారు. తాము తలపెట్టిన సమ్మెకు అన్ని ఆర్టీసీ సంఘాలు, ప్రజా సంఘాలు మద్ధతు ప్రకటించాయని ఆయన తెలిపారు.
RTC Strike | త్రినేత్ర.న్యూస్: రేపటి నుంచి చేపట్టనున్న ఆర్టీసీ సమ్మె(RTC Strike)పై రాష్ట్ర ప్రభుత్వ జోక్యం అవసరమని, ఆర్టీసీని హైదరాబాద్‌లో లేకుండా చేయాలని చూస్తున్నారని జేఏసీ చైర్మన్ వెంకన్న(JAC chairman Venkanna) విమర్శించారు. మంగళవారం ఆయన జేఏసీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. తాము తలపెట్టిన సమ్మెకు అన్ని ఆర్టీసీ సంఘాలు, ప్రజా సంఘాలు మద్ధతు ప్రకటించాయని ఆయన తెలిపారు. సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం, యాజమాన్యంలో చలనం లేదని మండిపడ్డారు. చర్చల ఊసే లేకపోవడం విచారకరమన్నారు.
ఇప్పటికైనా సమ్మెపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియను మరిచిపోయారు. ఇప్పటికీ ఆ ప్రక్రియను ప్రారంభించలేదు. కాలయాపన చేయడానికే విలీన కమిటీ వేశారు. దాని వల్ల ఎటువంటి ప్రయోజనం కలగలేదు. నష్టాల్లో ఉన్న మెట్రోను ప్రభుత్వపరం చేయాలని చూస్తున్నారు. కానీ ఆర్టీసీని మాత్రం పట్టించుకోకపోవడం దుర్మార్గం. ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పుడు మూసీ అభివృద్ధి ఎలా చేస్తున్నారో చెప్పాలి అని జేఏసీ నేతలు ప్రశ్నించారు.
ఎలక్ట్రికల్ బస్సులతో ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన సరికాదు. ఆర్టీసీని హైదరాబాద్‌లో లేకుండా చేయాలనుకోవడం తగదు. ఆర్టీసీ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నారు. ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొనాలి. ఆర్టీసీ సమ్మె మరో సకల జనుల సమ్మెగా మారబోతోంది అని జేఏసీ ఛైర్మన్ వెంకన్న, నేతలు హెచ్చరించారు.
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, వేతన సవరణ చేయాలనే డిమాండ్‌తో రవాణాశాఖ మంత్రి, ఆర్టీసీ ఎండీతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈనెల 22 నుంచి తలపెట్టిన సమ్మెకు మద్దతు ఇస్తున్నట్టు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.హనుమంత్ ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షుడు డీవీకే రావు తెలిపారు.
తాజావార్తలు
- ●Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ
- ●Ganesh Festival | గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
- ●Harish Rao | జీవో 97 రద్దు చేయకపోతే.. లక్ష మందితో సచివాలయం ముట్టడి
- ●Rahul Ramakrishna | కట్టె కాలే వరకు కేసీఆర్ వెంటే.. రాహుల్ ఎమోషన్ ట్వీట్
- ●Mrunal Thakur | బాహుబలి ప్రీక్వెల్ - శివగామి పాత్రలో మృణాల్ ఠాకూర్ - వంద కోట్లతో షూటింగ్ - కట్ చేస్తే!
- ●Etala Rajendar | కాంగ్రెస్‌లో రేవంత్ ఉడుం లెక్క చొర్రిండట.. వాళ్ల కార్యకర్తలే ఆయనపై కోపంగున్నరు

Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ

Ganesh Festival | గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

Harish Rao | జీవో 97 రద్దు చేయకపోతే.. లక్ష మందితో సచివాలయం ముట్టడి

Rahul Ramakrishna | కట్టె కాలే వరకు కేసీఆర్ వెంటే.. రాహుల్ ఎమోషన్ ట్వీట్



