Gaddar Awards function | గద్దర్ అవార్డుల ఫంక్షన్‌లో ఆర్టిస్టుల ఖర్చే రూ.4 కోట్లు : దాసోజు శ్రవణ్
Gaddar Awards function | గద్దర్ అవార్డుల ఫంక్షన్‌లో (Gaddar Awards function) ఆర్టిస్టుల కోసమే ప్రభుత్వం రూ.4 కోట్లు ఖర్చు చేసిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ (MLC Dasoju Shravan Kumar) ఆరోపించారు.
Gaddar Awards function | గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 పేరుతో ప్రజల పైసలతోటి ప్రభుత్వం అడ్డగోలు ఖర్చు చేసిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ (MLC Dasoju Shravan Kumar) అన్నారు. ఆర్టిస్టుల కోసమే రూ.4 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తెలంగాణ సంస్కృతిని గాలికి వదిలేసి, పిలిచిన పెద్దమనుషులను, జ్యూరీ సభ్యులను అవమాన పరిచిన తీరు ఇది అంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
మార్చి 19న హైటెక్స్ సెంటర్‌లో జరిగిన ఈ అవార్డుల కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దమొత్తంలో పైసలు కుమ్మరించిందని ఆరోపించారు. ఈ ఈవెంట్ కాంట్రాక్ట్‌ను ముంబైకి చెందిన ‘విజ్‌క్రాఫ్ట్’ (Wizcraft) సంస్థకు ఇవ్వడంపై కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కాంట్రాక్ట్ ఆ సంస్థకు ఎలా ఇచ్చారు..? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఏజెన్సీలు లేవా..? ఈవెంట్‌కు ఓపెన్ టెండర్ పిలిచారా లేక తమకు కావాల్సిన వారికి కట్టబెట్టారా..? అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆర్టిస్టుల కోసమే పెట్టిన ఖర్చులివే..
ఈవెంట్ ఏజెన్సీ ముద్ర ఉన్న ఒక డాక్యుమెంట్ బయటపడినట్లు దాసోజు శ్రవణ్ తెలిపారు. అందులో ఉన్న లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయని వ్యాఖ్యానించారు. కేవలం ఆర్టిస్టుల కోసమే రూ.4 కోట్లకుపైగానే ఖర్చు చేసినట్లు తెలిపారు.
- శ్రేయా ఘోషల్ : రూ.1,65,00,000
- డి.ఎస్.పి (DSP) : రూ.60,00,000
- డి.ఎస్.పి టెక్ రైడర్ : రూ.20,00,000
- నిధి అగర్వాల్ : రూ.20,00,000
- వి అన్‌బీటబుల్ (స్పెషల్ యాక్ట్) : రూ.10,50,000
- క్లాసికల్ యాక్ట్ : రూ. 6,50,000
- హోస్ట్స్ (సుమ + ప్రదీప్) : రూ.13,00,000
- కొరియోగ్రాఫర్స్ & డాన్సర్స్ : రూ.39,20,000
- కాస్ట్యూమ్స్ : రూ.5,00,000
- ప్రయాణం, బస & తిండి : రూ.60,00,000
- రెడ్ కార్పెట్ యాంకర్స్ : రూ.7,00,000
- హెయిర్ & మేకప్ : రూ.5,00,000
- మొత్తం ఆర్టిస్టుల ఖర్చే: రూ.4,11,20,000
ఇది కేవలం ఆర్టిస్టుల బిల్లు మాత్రమే అని దాసోజు పేర్కొన్నారు. స్టేజ్, లైటింగ్, వేదిక ఖర్చులు ఇంకెన్ని రూ.కోట్లో లెక్క తేలాలన్నారు. అదే డాక్యుమెంట్‌లో 'టెండర్ కాస్ట్' కాలమ్‌లో ₹2,13,00,000 అని ఉందని చెప్పారు. కానీ అసలు బిల్లు మాత్రం రూ.4,11,20,000 వేయడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనుకున్న దానికంటే దాదాపు రూ.1,98,20,000 (రెండు కోట్లు) అదనంగా ఖర్చు పెట్టారని వెల్లడించారు. ఈ అదనపు ఖర్చుని ఎవరు ఓకే చేశారని ప్రశ్నించారు.
సంక్షేమ పథకాలకు పైసల్లేవన్నారు..
రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇయ్యడానికి పైసల్లేవు, రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా బాకీలు అట్నేపెట్టింది, బడ్జెట్ పెట్టిన ప్రతీసారీ ఖజానా ఖాళీ అని ఏడుపు, పైసల్లేవని ఎన్నో సంక్షేమ పథకాలను ఆపేసిన ప్రభుత్వం... ఇప్పుడు ఒక్క రాత్రి ముచ్చట కోసం రూ.4 కోట్లు కుమ్మరించడానికి పైసలు ఎక్కడికెళ్లి వచ్చినయ్..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విచ్చలవిడి ఖర్చులపై ప్రభుత్వం నోరు మెదపాలన్నారు. దీనికి బాధ్యులైన ఎఫ్.డి.సి (FDC) చైర్మన్ పైన గానీ, సంబంధిత మంత్రి పైన గానీ ఎందుకు చర్యలు తీసుకోరు..? అని ప్రశ్నించారు.
గద్దర్ పేరు చెప్పి రూ.4 కోట్ల సెలబ్రిటీ షో చేశారు..
మహనీయుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ బతికినంత కాలం ఎంతో సాదాసీదాగా బతికిండు. భూమి లేని కూలీల కోసం, వెట్టిచాకిరిలో నలిగే పేదల కోసం, గొంతు లేని వాళ్ల గొంతుకై పాట పాడిండు. సామాజిక న్యాయం, మానవ హక్కుల కోసం తన జీవితాంతం కొట్లాడిన ప్రపంచంలోనే గొప్ప విప్లవ కవి ఆయన. అటువంటి మహానుభావుడి పేరు మీద సినిమా అవార్డులు పెట్టడమే మూర్ఖత్వం. దానికి తోడు విచ్చలవిడి దుబారా దోపిడీకి పాల్పడటం నేరం. తన జీవితంలో విలాసాలను ఛీకొట్టిన గద్దర్ గారి పేరు మీద ఇలా రూ.4 కోట్ల సెలబ్రిటీ షో చేయడం ఆయనను గౌరవించడం కాదు.. ఆయన ఆశయాలను నిలువునా మోసం చేయడమే..! అని దాసోజు పేర్కొన్నారు.
అవార్డుల వేడుక కోసం పెట్టిన ఖర్చు మొత్తం బయటపెట్టాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓపెన్ టెండర్ ప్రక్రియకు సంబంధించిన సాక్ష్యాలు చూపించాలని, బడ్జెట్ కంటే అదనంగా ఖర్చు పెట్టిన రూ.1.98 కోట్లకు కారణం ఏంటో చెప్పాలని, ఈ అడ్డగోలు ఖర్చును ఆమోదించిన పెద్ద మనిషి ఎవరో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇవి ప్రజల పైసలని తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేయలేని, రైతులు, ఉద్యోగుల గోస తీర్చలేని ఈ ప్రభుత్వానికి.. కోట్లు తగలేసి ఇలాంటి 'హంగామా' చేసే నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించారు. గద్దర్ ఆత్మ శాంతించాలన్నా.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలబడాలన్నా.. ఈ అడ్డగోలు ఖర్చుపై ప్రభుత్వం లెక్క చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు.
https://x.com/sravandasoju/status/2036297457517404204
Also Read..
గ్యాస్ సిలిండర్ మోసే శక్తి ఇంకా రాలేదు : కేటీఆర్
జీవన్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ
హైదరాబాద్ పట్ల నిర్లక్ష్య వైఖరి సరికాదు : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Mahesh Kumar Goud | తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి: టీపీసీసీ చీఫ్
- ●New Pensions | గుడ్‌న్యూస్.. పంద్రాగస్టు నుంచి కొత్త పింఛన్లు..
- ●KCR | ఆప్త మిత్రున్ని కోల్పోయా.. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి
- ●Peddi Sudarshan Reddy | నల్లబెల్లికి పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయం.. మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు
- ●Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత
- ●Horoscope | జూలై 31 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!

Mahesh Kumar Goud | తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి: టీపీసీసీ చీఫ్

New Pensions | గుడ్‌న్యూస్.. పంద్రాగస్టు నుంచి కొత్త పింఛన్లు..

KCR | ఆప్త మిత్రున్ని కోల్పోయా.. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి

Peddi Sudarshan Reddy | నల్లబెల్లికి పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయం.. మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు






