KTR | గ్యాస్ సిలిండర్ మోసే శక్తి ఇంకా రాలేదు : కేటీఆర్
KTR | ఒరిజినల్ గ్యాస్ సిలిండర్ మోసే శక్తి ఇంకా రాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నెలకొన్న గ్యాస్ కొరతపై (gas shortage) గన్ పార్క్ (Gun Park) వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు (BRS MLAs And MLCs protest).
KTR | ఒరిజినల్ గ్యాస్ సిలిండర్ మోసే శక్తి ఇంకా రాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నెలకొన్న గ్యాస్ కొరతపై (gas shortage) గన్ పార్క్ (Gun Park) వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు (BRS MLAs And MLCs protest). గ్యాస్ సిలిండర్ల ప్లకార్డులతో నిరసనకు దిగారు. పెరిగిన ధరలపై ఆందోళన వ్యక్తం చేశారు. "కేంద్రం చెబుతోంది కొరత లేదు.. రాష్ట్రం చెబుతోంది సప్లై లేదు.. నిజం ఏది..? ప్రజలకు చెప్పండి..!" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
గ్యాస్ కొరత లేదని చెబుతూనే హోటళ్లు, చిరు వ్యాపారులకు వాణిజ్య సిలిండర్ల సరఫరాను ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి గ్యాస్ సరఫరా సంక్షోభంపై ప్రజలకు నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఎక్కువైందని చెప్పారు. ఆంబోతుల కొట్లాటలో లేగదూడలు బలైనట్లు.. సామాన్య మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతీ ఇంట్లో ఇదే చర్చ..
"దేశ వ్యాప్తంగా గ్యాస్ ఏజెన్సీల దగ్గర ప్రజలు పెద్ద ఎత్తున్న క్యూ లైన్‌లో ఉంటున్నారు. దేశంలో గ్యాస్ కొరత లేదని, సరిపడ నిల్వలు ఉన్నాయని కేంద్రం చెబుతోంది. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు వేరుగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం సహకరించడం లేదు, సప్లై లేదు, ఇబ్బంది ఉంది, పెట్రోలియం శాఖ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. మాకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత మే 4 నుంచి కేంద్రం సిలిండర్ సైజ్ తగ్గించే ప్రయత్నం చేయబోతోంది. 12 కిలోల సిలిండర్ 10 కిలోలు కాబోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి మధ్య తరగతి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. మా ఇంట్లో నా భార్య సైతం గ్యాస్ దొరకడం కష్టమంట కదా అని అడుగుతోంది. ప్రతీ ఇంట్లో ఇదే చర్చ జరుగుతోంది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి. ఎల్పీజీ కొరతపై శాసనసభ, మండలిలో వాయిదా తీర్మానం ఇస్తున్నాము. దీనిపై చర్చకు పట్టుబడుతాము. ప్రజల గొంతుకుగా అసెంబ్లీలో మాట్లాడతాము" అని కేటీఆర్ అన్నారు. ఇరాన్‌లో ఇబ్బంది ఉంటే మరో దేశం నుంచి తెప్పించాలని ఈ సందర్భంగా కేటీఆర్ డిమాండ్ చేశారు.
https://x.com/KTR_News/status/2036301930948120584
https://x.com/KTR_News/status/2036308538260332649
Also Read..
సంతోష్ నగర్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను జూన్‌లోగా పూర్తి చేయాలి
జీవన్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ
శ్రీరామనవమి శోభాయాత్ర.. 3000 మంది పోలీసులతో భద్రత.. డ్రోన్లతో పర్యవేక్షణ
సంబంధిత వార్తలు

KTR | తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పాత్ర చిరస్మరణీయం: కేటీఆర్
జులై 31, 2026

Vaddiraju Ravichandra | పరీక్ష అంటే ఏండ్ల కష్టం.. అందుకే ప్రజా పరీక్షల సవరణ బిల్లుకు మద్దతిస్తున్నం
జులై 30, 2026

KTR | యువ ఇంజినీర్ల ప్రతిభను క్రిమినల్ వేస్ట్ అని అవమానిస్తారా..? : రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
జులై 30, 2026
తాజావార్తలు
- ●Ration Card e-KYC | మరో నెల రోజులు.. రేషన్ కార్డు ఈ-కేవైసీ గడువు పెంపు
- ●KTR | తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పాత్ర చిరస్మరణీయం: కేటీఆర్
- ●Mahesh Kumar Goud | తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి: టీపీసీసీ చీఫ్
- ●New Pensions | గుడ్‌న్యూస్.. పంద్రాగస్టు నుంచి కొత్త పింఛన్లు..
- ●KCR | ఆప్త మిత్రున్ని కోల్పోయా.. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి
- ●Peddi Sudarshan Reddy | నల్లబెల్లికి పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయం.. మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు

Ration Card e-KYC | మరో నెల రోజులు.. రేషన్ కార్డు ఈ-కేవైసీ గడువు పెంపు

KTR | తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పాత్ర చిరస్మరణీయం: కేటీఆర్

Mahesh Kumar Goud | తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి: టీపీసీసీ చీఫ్

New Pensions | గుడ్‌న్యూస్.. పంద్రాగస్టు నుంచి కొత్త పింఛన్లు..



