KP Vivekananda | హైదరాబాద్ పట్ల నిర్లక్ష్య వైఖరి సరికాదు : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
KP Vivekananda | హైదరాబాద్ అభివృద్ధి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పేర్కొన్నారు. రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్‌ను నిర్లక్ష్యం చేయడం సరికాదు అని తెలిపారు.
KP Vivekananda | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ అభివృద్ధి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పేర్కొన్నారు. రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్‌ను నిర్లక్ష్యం చేయడం సరికాదు అని తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో రహదారుల మౌలిక సదుపాయాలపై కేపీ వివేకానంద మాట్లాడుతూ.. పలు సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు.
కేసీఆర్ హయాంలో 47 ప్రాజెక్టులను తీసుకొచ్చాం. ఎస్ఆర్డీపీ ప్రోగ్రామ్ తీసుకుని ఫ్లై ఓవర్లు, లింకు రోడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను తగ్గించాం. ఏడెమినిదేండ్లలోనే కొత్త ఫ్లై ఓవర్లు నిర్మించాం. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక మెజార్టీ రావడానికి కారణం.. మేం చేసిన అభివృద్ధినే. అభివృద్ధి పనుల పట్ల ఎలాంటి పురోగతి లేదు. క్యాన్షిల్ అయిన వర్కులను సభలో పెట్టడం సరికాదు. అధికారుల పనితీరు ఎలా ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది. సీఎం చెప్పే మాటకు ఆచరణకు తేడా లేదు. సీఎం రాజకీయాలు చేస్తున్నారు. బాచుపల్లి ఫ్లై ఓవర్ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని కేపీ వివేకానంద పేర్కొన్నారు.
జీహెచ్‌ఎంసీ అభివృద్ధిపై చర్చ జరగాలని విజ్ఞప్తి చేస్తున్నా. కుత్బుల్లాపూర్‌లో ఫ్లైఓవర్ పనులు ఇప్పటివరకు పూర్తి కాలేదు. రహదారులపై హెచ్‌ఎండీఏ కమిషనర్‌ను అడిగితే.. ఒత్తిడి ఉన్నట్లు తెలిపారు. పర్యవేక్షణ లేక పలు అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయి. నిర్లక్ష్య వైఖరితోనే పనులు నిలిచిపోతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Mahesh Kumar Goud | తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి: టీపీసీసీ చీఫ్
- ●New Pensions | గుడ్‌న్యూస్.. పంద్రాగస్టు నుంచి కొత్త పింఛన్లు..
- ●KCR | ఆప్త మిత్రున్ని కోల్పోయా.. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి
- ●Peddi Sudarshan Reddy | నల్లబెల్లికి పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయం.. మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు
- ●Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత
- ●Horoscope | జూలై 31 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!

Mahesh Kumar Goud | తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి: టీపీసీసీ చీఫ్

New Pensions | గుడ్‌న్యూస్.. పంద్రాగస్టు నుంచి కొత్త పింఛన్లు..

KCR | ఆప్త మిత్రున్ని కోల్పోయా.. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి

Peddi Sudarshan Reddy | నల్లబెల్లికి పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయం.. మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు






