Minister Ponnam Prabhakar | ఆర్టీసీ కార్మికులు ప్రేరేపిత సమ్మెకు వెళ్లొద్దు : మంత్రి పొన్నం ప్రభాకర్
Minister Ponnam Prabhakar | ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ - అలైవ్ (arrive - alive) కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్‌ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) విడుదల చేశారు.
Minister Ponnam Prabhakar | ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ - అలైవ్ (arrive - alive) కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్‌ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) విడుదల చేశారు. నేటి నుంచి ఈనెల 18వ తేదీ వరకూ రోడ్ సేఫ్టీ కోసం పోలీసు, రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. రవాణా నిబంధనలు, ప్రమాదాలకు కారణాలు చర్చించి, వాటిని తగ్గించే చర్యలు తీసుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని తెలిపారు.
ట్రాఫిక్ నిబంధనలను రవాణా శాఖ కఠినంగా అమలు చేస్తోందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ప్రమాదాల నివారణ, ప్రాణ నష్టం లేకుండా చూడటమే కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగిన 'గోల్డెన్ అవర్' (ప్రమాదం జరిగిన మొదటి గంట)లో బాధితులను ఆసుపత్రిలో చేర్పిస్తే.. రహవీర్ అవార్డ్ ఇస్తారని తెలిపారు. అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు రవాణా నిబంధనలు వివరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆర్టీసీలో 30 ఏళ్ల సర్వీసులో ఉండి ఒక్క యాక్సిడెంట్ కూడా చేయని వారికి సన్మానం చేయాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. రోడ్ సేఫ్టీ సమావేశాలు ప్రతీ జిల్లాల్లో నిర్వహించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ సమ్మెపై కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అంశం కమిటీ దగ్గర ఉందని చెప్పారు. రెండు సమస్యలపై మినహా మిగతా అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని.. ప్రేరేపిత సమ్మెలకు వెళ్లొద్దని ఈసందర్భంగా కార్మికులకు సూచించారు. పెండింగ్ డీఏను ఇచ్చినట్లు చెప్పారు. పీఆర్‌సీపై కూడా ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జేటీసీలు చంద్రశేఖర్ గౌడ్, రమేశ్, శివ లింగయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read..
మహిళలతోనే ప్రజాస్వామ్యం మరింత బలోపేతం : ప్రధాని మోదీ
గోపీచంద్ హిస్టారికల్ మూవీ టైటిల్ ఇదే - క్రీస్తు శకం 642లో ఏం జరిగింది?
భారీ బ్యాటరీ, అదిరిపోయే డిజైన్‌తో లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ కొత్త స్మార్ట్ ఫోన్
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



