Kanti Velugu | ‘కంటి వెలుగు’ పథకం అద్భుతం.. మండలి చైర్మన్ ప్రసంశలు
Kanti Velugu | కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన కంటి వెలుగు పథకం అద్భుతమని శానసమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగించి, గ్రామీణ ప్రాంత ప్రజలకు కంటి చూపును ఇవ్వాలని చైర్మన్ సూచించారు.
Kanti Velugu | త్రినేత్ర.న్యూస్ : కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన కంటి వెలుగు పథకం అద్భుతమని శానసమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగించి, గ్రామీణ ప్రాంత ప్రజలకు కంటి చూపును ఇవ్వాలని చైర్మన్ సూచించారు.

అయితే మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారు. మొదటి విడుత కంటి వెలుగు పథకాన్ని 2019 ఆగస్టు 15న ప్రారంభించారు. ఈ పథకానికి స్ఫూర్తి ఏంటంటే.. ఒకరోజు కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో అగ్రికల్చర్ లేబర్‌తో సమావేశమయ్యారు. ఇక వారి బాగోగులు అడుగుతూ.. ఏం ఇబ్బందులు ఉన్నాయని కూలీలను ప్రశ్నించారు. ఓ 50 ఏండ్లకు పైబడ్డ మహిళ స్పందిస్తూ.. తనకు కంటి చూపు సరిగా లేదని, కుటుంబ సభ్యులు పట్టించుకోవడం లేదని కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని దృష్టిలో ఉంచుకున్న కేసీఆర్ తక్షణమే కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారు. అలా మొదటి దశలో ఒక కోటి 54 మందికి కంటి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు పంపిణీ చేశారు. రెండో దశలోనూ ఈ పథకం విజయవంతమైంది అని యాదవరెడ్డి పేర్కొన్నారు.
ఉచిత బస్సు కంటే కంటి వెలుగు పథకం బెటర్
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకం కంటే కంటి వెలుగు పథకం బెటర్ అని యాదవ రెడ్డి చురకలంటించారు. కంటి వెలుగు అనేది ఉపయోగకరమైన పథకం కూడా. కాబట్టి దయచేసి ప్రభుత్వం కంటి వెలుగు పథకాన్ని కొనసాగించాలి. ప్రభుత్వానికి ఆర్థిక భారం లేని పథకం ఇది. పేరు మార్చినా వారి ఇష్టం. ముందు చూపో.. దూరపు చూపో.. అని ఏదో ఒక పేరు పెట్టుకుని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని యాదవ్ రెడ్డి పేర్కొన్నారు.
కంటి వెలుగు మంచి పథకం : గుత్తా సుఖేందర్ రెడ్డి
యాదవ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించిన అనంతరం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. కంటి వెలుగు పథకాన్ని ఆయన సమర్థించారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రికి సూచన చేశారు. ఇది మంచి ప్రోగ్రామ్. భేషజాలకు పోవాల్సిన అవసరం లేదు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కన్ను, పన్ను విషయంలో కొంత అశ్రద్ధగా ఉంటారు. సీరియస్‌గా ఉండరు. కొంత ఇబ్బందులు ఉంటాయి. గత ప్రభుత్వంలో కంటి వెలుగు పథకం కింద ఉచితంగా అద్దాలు పంపిణీ చేశారు. ఆపరేషన్స్ వచ్చే వరకు క్యాంపుల్లో చేయలేదు. ఎవరికైతే శస్త్రచికిత్స అవసరమో వారిని కొన్ని ఆస్పత్రులకు అనుసంధానం చేసి సర్జరీలు చేయించారని గుత్తా సుఖేందర్ రెడ్డి గుర్తు చేశారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



