Ranveer Singh | సందీప్ వంగా డైరెక్షన్‌లో సినిమా – రిజెక్ట్ చేసిన ధురంధర్ హీరో
అర్జున్ రెడ్డి హిందీ రీమేక్‌గా తెరకెక్కిన కబీర్ సింగ్‌లో రణవీర్‌సింగ్ హీరోగా నటించాల్సిందట. కానీ బోల్డ్ కాన్సెప్ట్ అనే భయంతో సందీప్ వంగా ఆఫర్‌ను రణవీర్‌సింగ్ రిజెక్ట్ చేశాడు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో సందీప్ వంగా స్వయంగా వెల్లడించాడు.
Entertainment | Published On Jan 3, 2026, 6.08 pm IST
Ranveer Singh | రణవీర్‌సింగ్ హీరోగా నటించిన ధురంధర్ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. వరల్డ్ వైడ్‌గా 1150 కోట్లకుపైగా వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన హిందీ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ధురంధర్ ప్రేక్షకుల ముందుకొచ్చి నెల రోజులు అవుతున్న ఇప్పటికీ హౌజ్‌ఫుల్స్‌లో థియేటర్లలో ఆడుతోంది.
హీరో రణవీర్‌సింగ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా ధురంధర్ నిలిచింది. ఇందులో హమ్జా అలీ అనే స్పై పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచాడు రణవీర్‌సింగ్. యాక్టింగ్ పరంగా రణవీర్ కెరీర్‌లో బెస్ట్ మూవీ ఇదని అభిమానులు పేర్కొంటున్నారు.ధురంధర్ మూవీకి సీక్వెల్ కూడా రాబోతుంది. ధురంధర్ 2 పేరుతో రూపొందుతున్న ఈ మూవీని మార్చి 19న విడుదలచేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
సందీప్ వంగా ప్రశంసలు...
ధురంధర్ మూవీపై ఆడియెన్స్‌తో పాటు ఇండస్ట్రీకి చెందిన దిగ్గజ దర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ధురంధర్ పవర్‌ఫుల్ మూవీ అని, యాక్టింగ్, డైరెక్షన్, స్క్రీన్‌ప్లేతో పాటు అన్నింటిలో టాప్ నాచ్‌గా ఉందంటూ స్పిరిట్ డైరెక్టర్ సందీప్ వంగా మూవీ టీమ్‌ను అభినందిస్తూ ఇటీవల ఓ పోస్ట్ పెట్టాడు.
అర్జున్ రెడ్డి రీమేక్...
తాజాగా సందీప్ వంగా మరో ఇంట్రెస్టింగ్ సీక్రెట్‌ను బయటపెట్టాడు. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్‌ను రణవీర్‌సింగ్‌తో చేయాలని ప్రయత్నించినట్లు చెప్పాడు. కానీ సందీప్ వంగా ఆఫర్‌ను ధురంధర్ హీరో రిజెక్ట్ చేశాడట. అర్జున్ రెడ్డి తెలుగులో పెద్ద హిట్టవ్వడంతో హిందీలో రీమేక్ చేసే ఛాన్స్ వచ్చింది. ఈ రీమేక్‌లో హీరోగా రణవీర్‌సింగ్ అయితే బాగుంటుందనిపించింది. అతడిని అప్రోచ్ అయ్యాను. కానీ కథ చాలా బోల్డ్‌గా....ఇలాంటి డార్క్ కాన్సెప్ట్‌తో కూడిన సినిమాలో తనను ఆడియెన్స్ యాక్సెప్ట్ చేయలేరనే భయంతో కబీర్‌సింగ్ మూవీని రణవీర్‌సింగ్ రిజెక్ట్ చేశాడు అలా రణవీర్‌సింగ్ సినిమా చేసే ఛాన్స్ మిస్సయ్యింది అని సందీప్ వంగా అన్నారు.
షాహిద్ కపూర్‌ను హీరోగా ఫిక్స్ చేసిన తర్వాత కూడా చాలా మంది భయపెట్టారని అన్నాడు. షాహిద్ సోలో హీరోగా నటించిన సినిమాలేవి వంద కోట్లు దాటలేదు, అతడితో సినిమా అంటే రిస్క్ అని అన్నారు. అవేవి పట్టించుకోకుండా సినిమా చేశానని సందీప్ వంగా చెప్పారు.
కేవలం 60 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన కబీర్‌సింగ్ 379 కోట్లతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. 2019లో రిలీజైన ఈ మూవీ ఆ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



