Barse Deva | 20 ఏండ్లలో 121 మందిని బలిగొన్న బర్సే దేవా..! హై ప్రొఫైల్ అటాక్స్ ఇవే..!!
Barse Deva | మావోయిస్టు అగ్రనేత, పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ (PLGA) చీఫ్, కేంద్ర కమిటీ సభ్యుడు బర్సే దేవా( Barse Deva ) (48) సహా 20 మంది మావోయిస్టులు భారీ ఆయుధాలతో సహా తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు.
Barse Deva | త్రినేత్ర.న్యూస్ : మావోయిస్టు అగ్రనేత, పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ (PLGA) చీఫ్, కేంద్ర కమిటీ సభ్యుడు బర్సే దేవా( Barse Deva ) (48) సహా 20 మంది మావోయిస్టులు భారీ ఆయుధాలతో సహా తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఆపరేషన్ కగార్ ప్రారంభమైన తరువాత తెలంగాణలో జరిగిన అతి పెద్ద లొంగుబాటు ఇదే కావడం విశేషం. వారి నుంచి 48 మౌంటెడ్ ఎంఎల్‌జీ ఆయుధాలతో పాటు రూ. 20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
అసలు ఎవరీ బర్సే దేవా..?
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలోని పువ్వర్తి గ్రామానికి చెందిన బర్సే దేవా కోయ జాతిలో పురుడు పోసుకున్నాడు. 10వ తరగతి వరకు చదువుకున్న దేవా.. 2003లో మావోయిస్టు పార్టీలో చేరాడు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి నిషేధిత మావోయిస్టు పార్టీలో పీఎల్‌జీఏ బెటాలియన్ నంబర్ 1 కమాండర్ స్థాయికి ఎదిగాడు. దక్షిణ బస్తర్, దంతెవాడ, సుక్మాలో స్థానికులతో బర్సేకు సత్సంబంధాలు ఉండేవి. 20 ఏండ్ల కాలంలో 121 మందికి పైగా భద్రతా సిబ్బంది, సాధారణ పౌరులను హత్య చేయడంలో కీలకపాత్ర పోషించాడు దేవా.
హిడ్మాకు అత్యంత సన్నిహితుడు
మాడవి హిడ్మాకు అత్యంత సన్నిహితుడిగా మెలిగాడు దేవా. గతేడాది నవంబర్ నెలలో ఏపీలో హిడ్మాను ఎన్‌కౌంటర్ చేసిన తర్వాత.. బెటాలియన్ 1కు కమాండర్‌గా నియామకం అయ్యాడు. ప్రముఖ రాజకీయ నాయకులను, పోలీసు ఉన్నతాధికారులను మట్టుబెట్టేందుకు దేవా కీలకంగా వ్యవహరించి, రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం ఖతం చేసేవాడని నిఘా సంస్థలు పేర్కొన్నారు. బలగాల క్యాంపులపై కూడా చాకచక్యంగా ఐఈడీ దాడులు చేసేవాడని తెలిపాయి. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల జాబితాలో బర్సే దేవా కూడా ఉన్నాడు. అతని తలపై కోటి రూపాయాల రివార్డు కూడా ఉంది. ఛత్తీస్‌గఢ్ పోలీసులు రూ. 50 లక్షల రివార్డు, తెలంగాణ పోలీసులు రూ. 20 లక్షల రివార్డు ప్రకటించారు.
బర్సే దేవా వ్యూహానికి బలైంది వీరే..
ఫిబ్రవరి 2006, ఎర్రబోరు(సుక్మా) : ఐఈడీ పేల్చడంతో 25 మంది సల్వా జుడుం మెంబర్లు మృతి
మే 2010, సింగవరం(దంతెవాడ) : బస్సును పేల్చేసిన ఘటనలో 30 మంది కోయ స్పెషల్ పోలీసు ఆఫీసర్లు మృతి, మరో 15 మందికి తీవ్ర గాయాలు
మార్చి, మే 2016 దంతెవాడ : వేర్వేరు ప్రాంతాల్లో ఐఈడీలు పేల్చడంతో 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు హతం
ఏప్రిల్ 2019, కౌకొండ : ఐఈడీ పేల్చడంతో బీజేపీ ఎమ్మెల్యే భీమా మాందవితో పాటు నలుగురు భద్రతా సిబ్బంది మృతి
దేవా దాడులివే..
అక్టోబర్ 2011, నేత్నార్(జీరంఘాటి) : ఆరుగురు జవాన్లు హతం
మే 2012, కిరండూల్(ఎన్ఎండీసీ ఏరియా) : ఆరుగురు సీఐఎస్ఎఫ్ జవాన్లు, ఒక డ్రైవర్ హతం
మార్చి 2014, జీరంఘాటి : 15 మంది సీఆర్పీఎఫ్, డీఆర్జీ గార్డులు మృతి
ఏప్రిల్ 2021, టేకులగూడెం : 22 మంది సీఆర్పీఎఫ్, డీఆర్జీ జవాన్లు హతం, మరో 31 మందికి తీవ్ర గాయాలు, ఆయుధాలు లూటీ
అక్టోబర్ 2018, నిలవయా : ముగ్గురు భద్రతా సిబ్బంది, ఒక జర్నలిస్టు హతం
హై ప్రొఫైల్ అటాక్స్
మే 2013, జీరంఘాటి కాంగ్రెస్ కాన్వాయ్ అటాక్ : 27 మంది కాంగ్రెస్ నేతలు దారుణ హత్య(మాజీ కేంద్ర మంత్రి మహేంద్ర కర్మ, ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నంద్ కుమార్ పటేల్)
జనవరి 2024 : ధర్మారం, జీరంగూడ సెక్యూరిటీ క్యాంపులపై మెరుపుదాడి
ఇలా దాడులు జరిపి మొత్తం 121 మందిని బర్సే దేవా బలిగొన్నారు. 55 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో అత్యధికులు సీఆర్పీఎఫ్, డీఆర్జీ, సీఐఎస్ఎఫ్, రాష్ట్ర పోలీసులు, సాధారణ పౌరులు ఉన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



