త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pregnant Woman | ప్ర‌స‌వం కోసం 6 కి.మీ. న‌డ‌క‌.. క‌డుపులో ఉన్న బిడ్డ‌తో స‌హా గ‌ర్భిణి మృతి

Pregnant Woman | ఇది హృద‌య విదార‌క ఘ‌ట‌న‌. ప్ర‌స‌వం కోసం 6 కిలోమీట‌ర్లు న‌డిచి అల‌సిపోయిన ఓ నిండు గ‌ర్భిణి ప్రాణాలు కోల్పోయింది. క‌డుపులో ఉన్న బిడ్డ కూడా క‌న్నుమూసింది.

S

National | Published On Jan 3, 2026, 5.51 pm IST

Pregnant Woman | ప్ర‌స‌వం కోసం 6 కి.మీ. న‌డ‌క‌.. క‌డుపులో ఉన్న బిడ్డ‌తో స‌హా గ‌ర్భిణి మృతి
Advertisement

Pregnant Woman | త్రినేత్ర‌.న్యూస్ : ఇది హృద‌య విదార‌క ఘ‌ట‌న‌. ప్ర‌స‌వం కోసం 6 కిలోమీట‌ర్లు న‌డిచి అల‌సిపోయిన ఓ నిండు గ‌ర్భిణి ప్రాణాలు కోల్పోయింది. క‌డుపులో ఉన్న బిడ్డ కూడా క‌న్నుమూసింది. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని గడ్చిరోలి జిల్లాలో శుక్ర‌వారం చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. గ‌డ్చిరోలి జిల్లా ఎట‌ప‌ల్లి తాలుకా ప‌రిధిలోని అల్దండి టోలా గ్రామానికి చెందిన ఆశా సంతోష్ కిరంగ‌(24) కు నెల‌లు నిండాయి. అయితే అల్దండి టోలా గ్రామం అట‌వీ ప్రాంతంలో ఉండ‌డంతో స‌రైన రోడ్డు మార్గం లేదు. దీంతో నెల‌లు నిండ‌డంతో ఎప్పుడైనా పురిటి నొప్పులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని భావించిన భ‌ర్త‌.. జ‌న‌వ‌రి 1న ఆమెను ఆస్ప‌త్రికి తీసుకెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఈ క్ర‌మంలో అట‌వీ మార్గంలో 6 కిలోమీట‌ర్ల మేర న‌డిచి పెథాలోని త‌న సోద‌రి ఇంటికి చేరుకుంది.

ఇక జ‌న‌వ‌రి 2వ తేదీన తెల్ల‌వారుజామున ఆమెకు పురిటి నొప్పులు వ‌చ్చాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన కుటుంబ స‌భ్యులు అంబులెన్స్‌లో హెద్రీలోని కాలీ అమ్మ‌ల్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో సీజేరియ‌న్ చేయాల‌ని వైద్యులు నిర్ణ‌యించారు. కానీ స‌మ‌యానికి శ‌స్త్ర చికిత్స చేయ‌లేదు. ఆ లోపే క‌డుపులో ఉన్న బిడ్డ క‌న్నుమూసింది. బాధితురాలికి బీపీ అధిక‌మై ఆమె కూడా ప్రాణాలు విడిచింది.

ఈ ఘ‌ట‌న‌పై వైద్యాశాఖ ఉన్న‌తాధికారులు తీవ్రంగా స్పందించారు. విచార‌ణ‌కు ఆదేశించారు. ఈ నేప‌థ్యంలో గ‌డ్చిరోలి జిల్లా ఆస్ప‌త్రి అధికారి డాక్ట‌ర్ ప్ర‌తాప్ షిండే మాట్లాడుతూ.. బాధితురాలిని ప్రాణాల‌తో కాపాడేందుకు వైద్యులు ప్ర‌య‌త్నించారు. కానీ విఫ‌ల‌మైంద‌న్నారు. దీనిపై విచార‌ణ‌కు ఆదేశించామ‌ని, త్వ‌ర‌లోనే బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు.

Advertisement

తాజావార్తలు

Advertisement