త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT | ఓటీటీలోకి ర‌కుల్ ప్రీత్‌సింగ్ బాలీవుడ్‌ మూవీ – తండ్రి వ‌య‌సున్న వ్య‌క్తితో ప్రేమ‌లో ప‌డితే…

ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించిన బాలీవుడ్ మూవీ దే దే ప్యార్ దే 2 ఓటీటీలోకి రాబోతుంది. జ‌న‌వ‌రి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

N

News | Published On Jan 3, 2026, 7.53 pm IST

OTT | ఓటీటీలోకి ర‌కుల్ ప్రీత్‌సింగ్ బాలీవుడ్‌ మూవీ – తండ్రి వ‌య‌సున్న వ్య‌క్తితో ప్రేమ‌లో ప‌డితే…
Advertisement

OTT |  ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించిన లేటెస్ట్ బాలీవుడ్ మూవీ దే దే ప్యార్ దే 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. రొమాంటిక్ కామెడీగా తెర‌కెక్కిన ఈ సినిమాలో అజ‌య్ దేవ్‌గ‌ణ్ హీరోగా న‌టించాడు. ఆర్ మాధ‌వ‌న్ కీల‌క పాత్ర పోషించాడు. థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెల‌ల త‌ర్వాత దే దే ప్యార్ దే 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. జ‌న‌వ‌రి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది.

వంద కోట్ల క‌లెక్ష‌న్స్‌...

దే దే ప్యార్ దే మూవీకి సీక్వెల్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు అన్షుల్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఫ‌స్ట్ పార్ట్ స్థాయిలో సీక్వెల్ హిట్ట‌వ్వ‌లేక‌పోయింది. దే దే ప్యార్ దే 2 మూవీ వంద కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన నిర్మాత‌ల‌కు మాత్రం లాభాలు రాలేదు. 150 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సీక్వెల్ మూవీ 105 కోట్ల వ‌ర‌కు మాత్ర‌మే వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. కామెడీ, ఎమోష‌న్‌ను బ్యాలెన్స్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డిపోవ‌డం, లెంగ్తీ ర‌న్‌టైమ్ కార‌ణంగా ఈ బాలీవుడ్ సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది.

వ‌య‌సులో పెద్ద‌దైన అమ్మాయితో...

దే దే ప్యార్ దే మూవీకి కొన‌సాగింపుగానే ఈ సీక్వెల్ సాగుతుంది. ఆశీష్ మెహ్రా త‌న‌కంటే వ‌య‌సులో చిన్న‌దైన అయేషాతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. కానీ వారి ప్రేమ‌కు అయేషా త‌ల్లిదండ్రులు రాకేష్, అంజు అడ్డుచెబుతారు. ఆశీష్ ప్రేమ‌కు వ‌య‌సు ఎలా అడ్డంకిగా మారింది? అయేషా త‌ల్లిదండ్రుల‌ను ఎలా ఒప్పించాడు? ఈ క్ర‌మంలో అత‌డికి ఎదురైనా అడ్డంకులేమిట‌నే పాయింట్‌తో ఈ మూవీ రూపొందింది.

హిట్టు కోసం వెయిటింగ్‌...

ర‌కుల్ ప్రీత్ సింగ్ హిట్టు అందుకొని చాలా కాల‌మైంది. దే దే ప్యార్ దే 2పై చాలానే ఆశ‌లు పెట్టుకుంది. కానీ స‌క్సెస్ మాత్రం ద‌క్క‌లేదు. దేదే ప్యార్ దే 2 తో పాటు గ‌త ఏడాది మేరే హ‌జ్బెండ్ కి బీవీ సినిమా చేసింది. ఈ రెండు డిజాస్ట‌ర్‌గానే నిలిచాయి. ప్ర‌స్తుతం ప‌తీ ప‌త్నీ ఔర్ దో సినిమా చేస్తోంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా న‌టిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. మ‌రోవైపు ర‌కుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమా చేసి నాలుగేళ్లు దాటిపోయింది. ప్ర‌స్తుతం రీఎంట్రీ కోసం ఎదురుచూస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement