త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telugu Tv Serial | 13 ఏళ్లు టెలికాస్ట్ – నాలుగు వేల ఎపిసోడ్స్ – తెలుగులో లాంగెస్ట్ ర‌న్నింగ్ టీవీ సీరియ‌ల్ ఇదే!

తెలుగులో లాంగెస్ట్ ర‌న్నింగ్ టీవీ సీరియ‌ల్‌గా అభిషేకం నిలిచింది. దాస‌రి నారాయ‌ణ‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ నిర్మించిన ఈ సీరియ‌ల్ ప‌ద‌మూడేళ్ల పాటు టెలికాస్ట్ అయ్యింది. నాలుగు వేళ ఎపిసోడ్స్‌తో శుభంకార్డు వేశారు

N

Entertainment | Published On Jan 3, 2026, 5.01 pm IST

Telugu Tv Serial |  13 ఏళ్లు టెలికాస్ట్ – నాలుగు వేల ఎపిసోడ్స్ – తెలుగులో లాంగెస్ట్ ర‌న్నింగ్ టీవీ సీరియ‌ల్ ఇదే!
Advertisement

Telugu Tv Serial | టీవీ సీరియ‌ల్ అంటేనే ఏళ్ల‌కు ఏళ్లు సాగ‌దీయ‌డం కామ‌న్‌. టీవీ సీరియ‌ల్‌కు ప్రారంభ‌మే కానీ ఎండింగ్ అనేది ఉండ‌దంటూ అప్ప‌డ‌ప్పుడు ఫ‌న్నీ కామెంట్లు వినిపిస్తుంటాయి. ఓ సీరియ‌ల్ ఐదేళ్ల వ‌ర‌కు టెలికాస్ట్ కావ‌డం అంటే గొప్ప‌గా చెబుతుంటారు. కానీ ఓ తెలుగు టీవీ సీరియ‌ల్ మాత్రం ఏకంగా ప‌ద‌మూడేళ్లు ప్ర‌సార‌మైంది. లాంగెస్ట్ ర‌న్నింగ్ టీవీ సీరియ‌ల్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ సీరియ‌ల్ మ‌రేదో కాదు అభిషేకం.

2008లో మొద‌లు...

దివంగ‌త దిగ్గ‌జ‌ టాలీవుడ్ డైరెక్ట‌ర్ దాస‌రి నారాయ‌ణ‌రావు ద‌ర్శ‌క‌నిర్మాణంలో 2008లో అభిషేకం మొద‌లైంది. 2022 ఫిబ్ర‌వ‌రి 1న ఈ సీరియ‌ల్‌కు శుభం కార్డు వేశారు. నాలుగు వేల ఎపిసోడ్స్‌తో ప‌ద‌మూడేళ్ల‌ పాటు ఈటీవీలో ఈ సీరియ‌ల్ టెలికాస్ట్‌ అయ్యింది. అభిషేకం రికార్డును తెలుగులో ఇప్ప‌టివ‌ర‌కు ఏ సీరియ‌ల్ బ్రేక్ చేయ‌లేదు. కొవిడ్ కార‌ణంగా 2020లో మూడు నెల‌ల పాటు ఈ సీరియ‌ల్ ప్ర‌సారాన్ని నిలిపివేశారు.

దాస‌రి నారాయ‌ణ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో...

అభిషేకం సీరియ‌ల్‌కు దాస‌రి నారాయ‌ణ‌రావుతో పాటు హ‌రిచ‌ర‌ణ్, ల‌క్ష్మీ శ్రీనివాస్‌, వెంక‌ట్ శ్రీరామోజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అభిషేకం సీరియ‌ల్‌లో ర‌వికిర‌ణ్‌, స‌తీష్, మౌనిక, స‌మీర, హ‌రితేజ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. కుటుంబ విలువ‌లు, అనుబంధాలు పాయింట్‌తో మేక‌ర్స్ అభిషేకం సీరియ‌ల్‌ను రూపొందించారు.
అత్య‌ధిక రోజులు టెలికాస్ట్ అయిన సీరియ‌ల్స్ లిస్ట్‌లో రెండు, మూడు స్థానాల్లో కూడా ఈటీవీ సీరియ‌ల్స్‌లో ఉన్నాయి. ఆడ‌దే ఆధారం 3329 ఎపిసోడ్స్‌తో ఎండ‌య్యింది. ప‌ద‌కొండేళ్ల పాటు ఈ సీరియ‌ల్ తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. మ‌న‌సు మ‌మ‌త సీరియ‌ల్ 3305 ఎపిసోడ్స్‌తో ప‌దేళ్ల పాటు ప్ర‌సార‌మైంది. ఈ మూడు సీరియ‌ల్స్‌లో ప‌లువురు టాలీవుడ్ స్టార్స్ అతిథి పాత్ర‌ల్లో క‌నిపించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement