KTR | డీలిమిటేషన్‌తో అన్యాయం చేస్తే… దక్షిణాదిలో పెను ఉద్యమం తప్పదు: కేటీఆర్ హెచ్చరిక
KTR | నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశంపై భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. డీలిమిటేషన్‌తో అన్యాయం చేస్తే... దక్షిణాదిలో పెను ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
KTR | నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశంపై భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గేలా డీలిమిటేషన్ జరిగితే, అది కేవలం ఒక రాజకీయ ప్రక్రియగానో లేక చట్ట సవరణ గానో మిగిలిపోదని, మొత్తం దక్షిణ భారతదేశం అంతటా ఒక బలమైన ప్రజా ఉద్యమానికి దారితీస్తుందని హెచ్చరించారు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మూడేళ్లగా ఇదే తమ పార్టీ స్టాండ్ అని.. తాము తీసుకున్న దృఢమైన స్టాండ్‌కే కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
తామంతా గర్వించదగ్గ భారతీయులమని, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అత్యుత్తమ రాష్ట్రాల ప్రతినిధులమని కేటీఆర్ పేర్కొన్నారు. జనాభా నియంత్రణతో పాటు వివిధ రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్న దక్షిణ రాష్ట్రాలకు, ఈ పునర్విభజన వల్ల రాజకీయంగా అన్యాయం జరగడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించాల్సింది పోయి, వాటి ప్రాతినిధ్యాన్ని తగ్గించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కేటీఆర్ విమర్శించారు.
దేశంలోని అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటులో తమ ప్రజల స్వరాన్ని, ప్రతినిధిత్వాన్ని అణచివేయాలని చూస్తే తాము నిశ్శబ్దంగా చూస్తూ ఉండబోమని కేటీఆర్ స్పష్టం చేశారు. దక్షిణ భారతీయుల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తామని ప్రకటించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచించారు. “ఢిల్లీ పాలకులు తమ మాట వినాలని, బుద్ధి ప్రబలాలని ఆశిస్తున్నాం” అంటూ కేటీఆర్ తన ఎక్స్ పోస్టులో రాసుకొచ్చారు.
Also Read..
మంత్రి సీతక్కపై అసత్య ప్రచారం తగదు.. సత్యవతి రాథోడ్‌పై బండ్రు శోభారాణి మండిపాటు
ప్రీమియం ల్యాప్ టాప్‌లు ఆకర్షణీయమైన ధరల్లో.. కొత్త మోడల్స్‌ను లాంచ్ చేసిన అసుస్..
తాజావార్తలు
- ●Asaduddin Owaisi Jail Allegations | చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు అవాస్తవం: స్పష్టతనిచ్చిన తెలంగాణ జైళ్ల శాఖ
- ●Congress Govt | ఉత్తుత్తి కమిటీలేనా? 33 నెలల్లో45 కమిటీలు
- ●Harish Rao | సిద్దిపేట జిల్లాకు పదేళ్లు.. కీర్తి ఎల్లలు దాటేలా వేడుకలు చేద్దాం
- ●Ponnam Prabhakar | దేశ వ్యాప్తంగా కులగణన జరగాలి
- ●Mahesh Kumar Goud | తెలంగాణకు బీసీయే గ్యారంటీగా ముఖ్యమంత్రి అవుతాడు
- ●Delhi AAP Protest | ఢిల్లీలో ఆప్ రణరంగం: సీఈసీకి వ్యతిరేకంగా భగ్గుమన్న కార్యకర్తలు

Asaduddin Owaisi Jail Allegations | చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు అవాస్తవం: స్పష్టతనిచ్చిన తెలంగాణ జైళ్ల శాఖ

Congress Govt | ఉత్తుత్తి కమిటీలేనా? 33 నెలల్లో45 కమిటీలు

Harish Rao | సిద్దిపేట జిల్లాకు పదేళ్లు.. కీర్తి ఎల్లలు దాటేలా వేడుకలు చేద్దాం

Ponnam Prabhakar | దేశ వ్యాప్తంగా కులగణన జరగాలి




