KCR | కేసీఆర్‌కు మళ్లీ నోటీసులివ్వండి.. న్యాయవాదికి భూపాలపల్లి కోర్టు ఆదేశం
KCR | కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు మళ్లీ నోటీసులు జారీ చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు ఆదేశించింది.
KCR | త్రినేత్ర.న్యూస్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు మళ్లీ నోటీసులు జారీ చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు ఆదేశించింది. గతంలో పంపిన సమన్లు ఆయనకు అందలేదని తేలడంతో ఈసారి నోటీసులను పక్కాగా అందజేయాలని జిల్లా న్యాయవాదిని న్యాయస్థానం ఆదేశించింది. తాజాగా చేపట్టిన విచారణ సందర్భంగా హైదరాబాద్ నుంచి నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ప్రతినిధులు, మాజీ మంత్రి హరీశ్‌రావు తరఫు న్యాయవాదులు భూపాలపల్లి కోర్టుకు హాజరయ్యారు.
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో భారీ అక్రమాలు, నాణ్యతా లోపాలు జరిగాయని ఆరోపిస్తూ నాగవెల్లి రాజలింగమూర్తి అనే సామాజిక కార్యకర్త గతంలో భూపాలపల్లి కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ రాజలింగమూర్తి మరణించినప్పటికీ విచారణను ఆపకుండా కొనసాగించాలని గతంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలిచ్చిన విషయం విదితమే.
ఈ కేసులో కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు, నాటి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ప్రతివాదులుగా ఉన్నారు. అయితే ఈ కేసు తదుపరి విచారణను భూపాలపల్లి జిల్లా కోర్టు సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది.
తాజావార్తలు
- ●Corpus | రూ.1 కోటి సంపాదించాలా.. అయితే ముందు రూ.10 లక్షలు దాటండి.. ఎందుకంటే..?
- ●Komatireddy Rajagopal Reddy | ఖర్చెక్కువవుతుంది.. ఇందిరమ్మ ఇళ్లకిచ్చే నిధులు పెంచాలి
- ●P Chidambaram | బ్రిక్స్‌తో భారత్‌కు ఒరిగిందేంటి..? : చిదంబరం
- ●iOS 27 | ఐఫోన్లకు భారీ అప్డేట్.. సెప్టెంబర్ 14 నుంచే ఐఓఎస్ 27..
- ●Red Fort Blast | టార్గెట్ రెడ్ ఫోర్ట్ కాదు.. లాల్ మందిర్.. ఢిల్లీ పేలుడుపై సంచలన విషయాలు
- ●KTR | ఫ్యూచర్ సిటీ అనేది మాయ.. రేపటి రోజున నిలవదు, చెల్లదు

Corpus | రూ.1 కోటి సంపాదించాలా.. అయితే ముందు రూ.10 లక్షలు దాటండి.. ఎందుకంటే..?

Komatireddy Rajagopal Reddy | ఖర్చెక్కువవుతుంది.. ఇందిరమ్మ ఇళ్లకిచ్చే నిధులు పెంచాలి

P Chidambaram | బ్రిక్స్‌తో భారత్‌కు ఒరిగిందేంటి..? : చిదంబరం

iOS 27 | ఐఫోన్లకు భారీ అప్డేట్.. సెప్టెంబర్ 14 నుంచే ఐఓఎస్ 27..





