TGSWREIS | గురుకుల విద్యార్థులకు సువర్ణావకాశం.. ఉచితంగా నీట్ 2027 లాంగ్ టర్మ్ కోచింగ్.. వివరాలివే..!
TGSWREIS | మీరు గురుకుల విద్యార్థులా..? ఇంటర్ బైపీసీ( Inter BiPC ) పాసై నీట్ 2027( NEET 2027 )కు ప్రిపేరవుతున్నారా..? అయితే మీలాంటి వారి కోసం టీజీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్( TGSWREIS ) సంస్థ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్( NEET Long Term Coaching ) ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమైంది. వివరాలు మీ కోసం..
TGSWREIS | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలోని గురుకుల విద్యార్థులకు ప్రభుత్వం సువర్ణావకాశం కల్పించింది. నీట్-2027( NEET 2027 ) కు ప్రిపేరయ్యే విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన విద్యార్థులకు నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్( NEET Long Term Coaching ) ఉచితంగా ఇవ్వాలని టీజీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్( TGSWREIS ) నిర్ణయించింది. ఈ క్రమంలో ఆసక్తి గల విద్యార్థులను గురుకుల విద్యాలయాల సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివరాలివే..
ఎన్ని సీట్లు ఉన్నాయంటే..?
నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్‌కు మొత్తం 200 మంది విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు. ఇందులో అబ్బాయిలకు 100 సీట్లు, అమ్మాయిలకు వంద సీట్లు కేటాయించారు.
ఉచిత కోచింగ్ ఎక్కడంటే..?
బాలురకు చిల్కూరు సీవోఈలో, బాలికలకు మహేంద్రహిల్స్ సీవోఈలో ఉచిత కోచింగ్ ఇవ్వడంతో పాటు వసతి సౌకర్యాలు కల్పించనున్నారు.
అర్హతలు ఏంటి..?
నీట్ లాంగ్ టర్మ్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరంలో తప్పనిసరిగా ఇంటర్ బైపీసీ పాసై ఉండాలి. నీట్ -2026 రాతపరీక్షకు హాజరై ఉండాలి.
దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..?
అర్హులైన విద్యార్థులు ఆగస్టు 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఏయే కేటగిరి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు..?
ఈ లాంగ్ టర్మ్ ఉచిత కోచింగ్‌కు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులతో పాటు ఈడబ్ల్యూఎస్ కేటగిరి విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు ఎంత..?
నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ప్రోగ్రామ్‌కు సంబంధించి విద్యార్థుల నుంచి ఎలాంటి దరఖాస్తు ఫీజు వసూలు చేయడం లేదు. ఉచితంగానే దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులు ఎలా సమర్పించాలి..?
అర్హత గల విద్యార్థులు దరఖాస్తులను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం దాన్ని నింపి సంబంధిత కోచింగ్ సెంటర్లలో సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తులతో పాటు తదితర వివరాలకు ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి.. https://tgswreis.telangana.gov.in/
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Arrest | క్యూర్ కోడ్ స్కాన్ చేసి.. నకిలీ స్క్రీన్ షాట్ చూపించి
- ●New EHS | 921 ఆస్పత్రుల్లో ఈహెచ్ఎస్ అమలు
- ●Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..
- ●ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు
- ●Samantha | సినిమాలు మానేయాలనుకున్నా - విడాకుల తర్వాత జీవితంపై సమంత కామెంట్స్
- ●NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన

Arrest | క్యూర్ కోడ్ స్కాన్ చేసి.. నకిలీ స్క్రీన్ షాట్ చూపించి

New EHS | 921 ఆస్పత్రుల్లో ఈహెచ్ఎస్ అమలు

Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..

ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు





