త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Asus | ప్రీమియం ల్యాప్ టాప్‌లు ఆక‌ర్ష‌ణీయ‌మైన ధ‌ర‌ల్లో.. కొత్త మోడ‌ల్స్‌ను లాంచ్ చేసిన అసుస్‌..

Asus | కంప్యూట‌ర్ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ అసుస్ త‌న నూత‌న ల్యాట్ టాప్ మోడ‌ల్స్‌ను జెన్‌బుక్‌, వివోబుక్ సిరీస్‌లో భార‌త్‌లో ప్ర‌వేశ‌పెట్టింది. జెన్‌బుక్ సిరీస్‌లో ఎస్‌14, ఎస్‌16 మోడ‌ల్స్‌తోపాటు జెన్‌బుక్ డ్యుయో, జెన్‌బుక్ ఎ14, ఎ16 మోడ‌ల్స్ ల్యాప్‌టాప్‌ల‌ను విడుద‌ల చేసింది. వివోబుక్ సిరీస్‌లో 14, 16 ఇంచుల మోడ‌ల్స్‌, ఎస్‌14, ఎస్‌16 మోడ‌ల్స్ ను లాంచ్ చేసింది.

S

Technology | Published On Apr 15, 2026, 12.21 pm IST

Asus | ప్రీమియం ల్యాప్ టాప్‌లు ఆక‌ర్ష‌ణీయ‌మైన ధ‌ర‌ల్లో.. కొత్త మోడ‌ల్స్‌ను లాంచ్ చేసిన అసుస్‌..
Advertisement

Asus | కంప్యూట‌ర్ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ అసుస్ త‌న నూత‌న ల్యాట్ టాప్ మోడ‌ల్స్‌ను జెన్‌బుక్‌, వివోబుక్ సిరీస్‌లో భార‌త్‌లో ప్ర‌వేశ‌పెట్టింది. జెన్‌బుక్ సిరీస్‌లో ఎస్‌14, ఎస్‌16 మోడ‌ల్స్‌తోపాటు జెన్‌బుక్ డ్యుయో, జెన్‌బుక్ ఎ14, ఎ16 మోడ‌ల్స్ ల్యాప్‌టాప్‌ల‌ను విడుద‌ల చేసింది. వివోబుక్ సిరీస్‌లో 14, 16 ఇంచుల మోడ‌ల్స్‌, ఎస్‌14, ఎస్‌16 మోడ‌ల్స్ ను లాంచ్ చేసింది. ఈ మోడ‌ల్స్ కు బుధ‌వారం నుంచి ప్రీ ఆర్డ‌ర్‌ల‌ను ప్రారంభించిన‌ట్లు అసుస్ తెలిపింది. వీటిల్లో ప‌లు ఆక‌ర్ష‌ణీయ‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఇత‌ర కంపెనీల‌కు చెందిన ప్రీమియం మోడ‌ల్స్‌తో పోలిస్తే వీటి ధ‌ర త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. అసుస్ జెన్‌బుక్ ఎస్‌14 సిరీస్ ల్యాప్ టాప్‌ల‌ను Ceraluminum చాసిస్‌తో రూపొందించారు. అందువ‌ల్ల ఇవి ప్రీమియం లుక్‌లో క‌నిపిస్తాయి. కేవ‌లం 1.1 సెంటీమీట‌ర్ల మందాన్ని, 1.20 కిలోల బ‌రువును మాత్ర‌మే క‌లిగి ఉంటాయి.అందువ‌ల్ల వీటిని రోజూ ప్ర‌యాణాల్లో సుల‌భంగా తీసుకెళ్ల‌వ‌చ్చు. ఎక్కువ కాలం మ‌న్నిక‌గా ఉంటాయ‌ని కంపెనీ చెబుతోంది.

అద్భుత‌మైన డిస్‌ప్లే క్వాలిటీ..

అసుస్ జెన్‌బుక్ డ్యుయో మోడ‌ల్స్‌ను కూడా Ceraluminum చాసిస్‌తోనే రూపొందించారు. ఈ మోడ‌ల్స్‌లో 14 ఇంచుల 3కె రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేల‌ను ఇచ్చారు. ఇవి 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను క‌లిగి ఉంటాయి. ఎల్ఈడీ త‌ర‌హా ట‌చ్ డిస్‌ప్లేలు క‌నుక అద్బుత‌మైన క్వాలిటీని ఇస్తాయి. మ‌ల్టీ టాస్కింగ్ సుల‌భ‌త‌రం అవుతుంది. వీటిల్లో ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెస‌ర్ ల‌ను ఇచ్చారు. ఒక్క‌సారి ఫుల్ చార్జ్ చేస్తే 32 గంట‌ల బ్యాట‌రీ బ్యాక‌ప్‌ను ఇస్తాయ‌ని కంపెనీ తెలిపింది. ఇక జెన్‌బుక్ ఎ సిరీస్ ల్యాప్ టాప్‌ల‌ను అత్యంత లైట్ వెయిట్ మోడ‌ల్స్‌గా అందిస్తున్నారు. వీటి బ‌రువు 1 కిలో క‌న్నా త‌క్కువ‌గానే ఉంటుంద‌ని కంపెనీ తెలిపింది. ఇవి 33 గంట‌ల మేర బ్యాట‌రీ బ్యాక‌ప్‌ను ఇస్తాయ‌ని కంపెనీ చెబుతుండ‌గా, వీటికి ఓలెడ్ త‌ర‌హా డిస్‌ప్లేల‌ను ఇచ్చారు. స్నాప్ డ్రాగ‌న్ ఎక్స్‌2 సిరీస్ ప్రాసెస‌ర్ లు ఉంటాయి. ఏఐ ఆధారిత ప‌నుల‌ను చాలా వేగంగా నిర్వ‌హిస్తాయి.

ఏఐ ఆధారిత ప‌నులు వేగంగా..

అసుస్ వివోబుక్ 14, 16 సిరీస్ ల్యాప్ టాప్‌ల‌ను ఏఐ ఫీచ‌ర్లు ప్ర‌ధానంగా అందిస్తున్నారు. అందువ‌ల్ల వీటిల్లో సెర్చ్‌, స‌మ్మ‌రైజేష‌న్, టాస్క్ మేనేజ్‌మెంట్ వంటి స‌దుపాయాల‌ను యూజ‌ర్లు ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ ల్యాప్ టాప్‌ల‌లో ఇంటెల్ కోర్ అల్ట్రా 5 సిరీస్ 3 ప్రాసెస‌ర్‌ల‌ను ఇచ్చారు. ఇవి కూడా ఏఐ ఆధారిత ప‌నుల‌ను వేగంగా నిర్వ‌హిస్తాయి. ఇక అసుస్ వివోబుక్ ఎస్ సిరీస్ 14, 16 ఇంచ్ మోడ‌ల్ ల్యాప్‌టాప్‌లను అత్యంత లైట్ వెయిట్ డిజైన్‌తో, మెట‌ల్ బాడీతో రూపొందించారు. ఇవి 29 గంట‌ల మేర బ్యాట‌రీ బ్యాక‌ప్‌ను అందిస్తాయ‌ని అసుస్ తెలిపింది. వీటిల్లో ఇంటెల్ కోర్ అల్ట్రా 7 సిరీస్ ప్రాసెస‌ర్ల‌ను ఇచ్చారు. ఏఐ ప‌నుల కోసం ఈ ల్యాప్ టాప్‌లు కూడా అద్భుతంగా ప‌నిచేస్తాయి.

ధ‌ర వివ‌రాలు..

అసుస్ విడుద‌ల చేసిన ఈ కొత్త ల్యాప్ టాప్ మోడ‌ల్స్‌ను అసుస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌తోపాటు అసుస్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ వంటి ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్‌లు, ఇత‌ర ఆథ‌రైజ్డ్ రిటెయిల్ పార్ట్‌న‌ర్ స్టోర్స్‌లో ఏప్రిల్ 21 నుంచి విక్ర‌యించ‌నున్నారు. జెన్‌బుక్ ఎస్‌14 ల్యాప్ టాప్ సిరీస్ ప్రారంభ ధ‌ర రూ.1,79,990గా ఉంది. జెన్ బుక్ డ్యుయో సిరీస్ ప్రారంభ ధ‌ర‌ను రూ.2,99,990గా నిర్ణ‌యించారు. జెన్‌బుక్ ఎ14 సిరీస్ రూ.1.85,990కి, జెన్‌బుక్ ఎ16 సిరీస్ రూ.1,99,990 ధ‌ర‌కు, వివోబుక్ 14 రూ.98,990కి, వివోబుక్ 16 రూ.1,01,990 ధ‌ర‌కు, వివోబుక్ ఎస్‌14 రూ.1,28,990కి, వివోబుక్ ఎస్‌16 రూ.1,31,990 ప్రారంభ ధ‌ర‌కి అందుబాటులో ఉన్నాయి. జెన్‌బుక్ ఎ16 సిరీస్ మోడ‌ల్స్‌ను మాత్రం త‌రువాత విడుద‌ల చేస్తారు. ప్రీ ఆర్డ‌ర్ చేసేవారికి కేవ‌లం రూ.999కే 2 ఏళ్ల ఎక్స్‌టెండెడ్ వారంటీ, 3 ఏళ్ల యాక్సిడెంట‌ల్ డ్యామేజ్ ప్రొటెక్ష‌న్ ను ఇస్తున్నారు. అలాగే ఉచితంగా బ్యాక్‌ప్యాక్‌ను కూడా పొంద‌వ‌చ్చు.

Advertisement
Advertisement