త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ఆటో డ్రైవ‌ర్ల అక్ర‌మ అరెస్టుల‌ను ఖండించిన కేటీఆర్‌

KTR | ఆటో డ్రైవ‌ర్ల అసెంబ్లీ ముట్ట‌డి పిలుపు నేప‌థ్యంలో ఆటోడ్రైవ‌ర్ల జేఏసీ (Auto Drivers JAC) నేత‌లు, వేలాది మంది ఆటో డ్రైవ‌ర్ల‌ను అక్ర‌మంగా అరెస్టు చేయ‌డాన్ని బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ (KTR) ఖండించారు. వారికి ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తూ, ఈ అంశాన్ని అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లేందుకు ముట్ట‌డికి పిలుపునిచ్చార‌ని చెప్పారు.

A

Telangana | Published On Jan 3, 2026, 10.52 am IST

KTR | ఆటో డ్రైవ‌ర్ల అక్ర‌మ అరెస్టుల‌ను ఖండించిన కేటీఆర్‌
Advertisement

KTR | ఆటో డ్రైవ‌ర్ల అసెంబ్లీ ముట్ట‌డి పిలుపు నేప‌థ్యంలో ఆటోడ్రైవ‌ర్ల జేఏసీ (Auto Drivers JAC) నేత‌లు, వేలాది మంది ఆటో డ్రైవ‌ర్ల‌ను అక్ర‌మంగా అరెస్టు చేయ‌డాన్ని బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ (KTR) ఖండించారు. వారికి ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తూ, ఈ అంశాన్ని అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లేందుకు ముట్ట‌డికి పిలుపునిచ్చార‌ని చెప్పారు. రాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్ల (Auto Driver)ను, ఆటో యూనియన్ల (Auto Union) నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేస్తోందని ఆయన ఆరోపించారు. వేలాది మంది ఆటో డ్రైవర్లను రాష్ట్రవ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లలో అదుపులోకి తీసుకొని బంధించి ఉంచడం దుర్మార్గమైన చర్యగా అభివ‌ర్ణించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నిస్తే, నిర్బంధాలు, అరెస్టులతో గొంతు నొక్కుతున్నదని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా అరెస్టు చేసిన ఆటో యూనియన్ల నేతలను, ఆటో అన్నలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల అమలుపై స్పష్టమైన ప్రకటనను, ఆటో అన్నలు కోరినట్లుగానే ఈరోజే అసెంబ్లీలో ప్రభుత్వం చేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కొనసాగకుండా ఉండాలంటే, వారికి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాల్సిందేనని అన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement