Talasani Srinivas Yadav | 17న సికింద్రాబాద్‌లో పెద్ద ఎత్తున ఆందోళన: తలసాని శ్రీనివాస్‌యాదవ్
Talasani Srinivas Yadav | హైదరాబాద్ (Hyderabad) మహా నగరాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నారని అసెంబ్లీ (Assembly) లో బీఆర్ఎస్ (BRS) శాసనసభాపక్ష ఉపనేత (Deputy Floor Leader) తలసాని శ్రీనివాస్‌యాదవ్ (Talasani Srinivas Yadav) మండిపడ్డారు. విభజనకు వ్యతిరేకంగా ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు. మద్దతిచ్చే పార్టీలతో కలిసి నిరసనలు తెలుపుతామని ప్రకటించారు.
హైదరాబాద్ అడ్డగోలు విభజనకు వ్యతిరేకంగా...
లష్కర్ చరిత్ర, సంస్కృతిని నాశనం చేసేందుకు కుట్ర
తక్షణమే సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో తలసాని
Talasani Srinivas Yadav | హైదరాబాద్ (Hyderabad) మహా నగరాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నారని అసెంబ్లీ (Assembly) లో బీఆర్ఎస్ (BRS) శాసనసభాపక్ష ఉపనేత (Deputy Floor Leader), మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ (Talasani Srinivas Yadav) మండిపడ్డారు. నగర విభజనను గూగుల్ మ్యాప్ (Google Map) ఆధారంగా చేసినట్లు ఉన్నారని ఆరోపించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ (Secunderabad) జంట నగరాలకు చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యం ఉందన్న ఆయన విభజనకు వ్యతిరేకంగా ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు. మద్దతిచ్చే పార్టీలతో కలిసి నిరసనలు తెలుపుతామని ప్రకటించారు. తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తలసాని మాట్లాడుతూ సికింద్రాబాద్ కు ఎంతో చరిత్ర ఉందని అన్నారు. టెక్నికల్ స్టడీ లేకుండా ప్రాంతాలను విభజిస్తున్నారని దుయ్యబట్టారు. సికింద్రాబాద్ చరిత్రను, సంస్కృతిని నాశనం చేసేందుకు, జంట నగరాల ఉనికి లేకుండా కుట్ర చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
రేవంత్... ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు మార్చు..
ముఖ్యమంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy)కి ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు మార్చాలని తలసాని సూచించారు. మహానగర విభజనపై కాంగ్రెస్ నాయకులకు కనీసం అవగాహన లేదని మండిపడ్డారు. డివిజన్లను కూడా సరిగా విభజించ లేదన్నారు. 24 నియోజకవర్గాలు ఉన్న మహానగరాన్ని విభజిస్తున్నప్పుడు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం బీఆర్ఎస్ హయాంలో 150 డివిజన్లు చేశామని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం మహానగరాన్ని ఇష్టమొచ్చినట్లు విభజిస్తుoదని ఆరోపించారు. ప్రభుత్వ పనుల కోసం ప్రజలు నగరం మొత్తం తిరిగే పరిస్థితి తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చట్టపరంగా పోరాడుతామని స్పష్టం చేశారు.
రేవంత్ మాటలకు, చేతలకు పొంతనే లేదు..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలకు, చేతలకు పొంతనే లేదని తలసాని విమర్శించారు. అందరి అభిప్రాయాలు తీసుకుంటామని చెబుతూనే.. అభిప్రాయం చెప్పకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో కూడా ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని వాపోయారు. ఎంతోమంది ముఖ్య మంత్రులను, స్పీకర్లను చూశానని, కానీ ఇలాంటి ముఖ్యమంత్రి, స్పీకర్‌ను చూడలేదని చెప్పారు. స్పీకర్ కనీసం ప్రతిపక్ష సభ్యుల వైపు చూడడం లేదని దుయ్యబట్టారు. ప్రజాసమస్యలపై పోరాడడం ప్రతిపక్ష పార్టీ పని అని, కానీ స్పీకర్ ప్రతిపక్ష పార్టీని నిలువరిస్తున్నారన్నారు. గంటన్నర పాటు రేవంత్ రెడ్డి బూతు పురాణం మాట్లాడుతున్నా స్పీకర్ అడ్డు చెప్పలేదని గుర్తు చేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా ఆయనకు వత్తాసు పలికేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
పిచ్చోడి చేతిలో రాయిలా రాష్ట్రం పరిస్థితి: విప్ కేపీ వివేకానందగౌడ్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రజల మనోభావాలు పట్టడం లేదని శాసనసభలో బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ అన్నారు. అనుభవ రాహిత్యంతో రేవంత్ పనిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి కలెక్షన్లపై తప్ప దేనీపై కూడా ధ్యాస లేదని దుయ్యబట్టారు. మహానగర విభజనపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సైతం గొంతెత్తుతున్నారన్నారు. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సైతం హైదరాబాద్ విభజనపై అసెంబ్లీలో నిరసన తెలిపారని గుర్తు చేశారు. నగరాన్ని కుక్కలు చించిన విస్తరిలా మార్చే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఒక్క మంత్రి కూడా లేరని, విభజనపై మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లను కనీసం సంప్రదించలేదని ఆరోపించారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాల్లో సైతం దీనిపై సమగ్ర చర్చ జరగలేదని పేర్కొన్నారు. దొంగచాటున హైదరాబాద్ మహానగర విభజన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారని మండిపడ్డారు. పరిపాలన సౌలభ్యం కోసం కేసీఆర్ హయాంలో కొత్త జిల్లాలు, మహానగర సంస్థలు, మున్సిపాలిటీలు, రెవెన్యూ డివిజనులు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నామని, కానీ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది జరగలేదని వివరించారు. రేవంత్ రెడ్డి మహానగర విభజనను గందరగోళంగా చేస్తున్నారని దుయ్యబట్టారు. దీనిపై ప్రజా పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



