Street Cause | మార్చి 1న “రన్ ఫర్ కాజ్”
Street Cause | నగరంలోని విద్యార్థులు నడిపే అతి పెద్ద స్వచ్ఛంద సంస్థ "స్ట్రీట్ కాజ్" (Street Cause) తన నిధుల సమీకరణకు మార్చి నెల 1న "రన్ ఫర్ కాజ్" (Run for Cause) పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండున్నర గంటల వరకు పీపుల్స్ ప్లాజా (People's Plaza) వేదికగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తామని వివరించింది.
Street Cause | నగరంలోని విద్యార్థులు నడిపే అతి పెద్ద స్వచ్ఛంద సంస్థ "స్ట్రీట్ కాజ్" (Street Cause) తన నిధుల సమీకరణకు మార్చి నెల 1న "రన్ ఫర్ కాజ్" (Run for Cause) పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండున్నర గంటల వరకు పీపుల్స్ ప్లాజా (People's Plaza) వేదికగా ఫ్లాష్ మాబ్ (Flash Mob), మారథాన్ రన్ (Marathon Run), గంటన్నర బ్యాండ్ ప్రదర్శన, బ్రేక్‌ఫాస్ట్ మేళా తదితర కార్యక్రమాలను నిర్వహిస్తామని వివరించింది. 2009లో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పటివరకు రూ.5.5 కోట్ల ఖర్చుతో పదిహేను వేలకుపైగా ప్రాజెక్టులు పూర్తి చేశామని తెలిపింది. దీని వలన 30 లక్షల మందికి పైగా ప్రజలు, 273 జంతువులకు ప్రయోజనం చేకూరిందని పేర్కొంది. నగరంలోని 30కి పైగా కళాశాలల నుంచి నాలుగు వేలకు పైగా వాలంటీర్లు, 45 వేల మందికి పైగా పూర్వ విద్యార్థులు సభ్యులుగా ఉన్నారని చెప్పింది. నగరంతో పాటు బెంగుళూరు, చెన్నై, కొచ్చి, ఢిల్లీ, ముంబై, పూణె, విశాఖపట్టణంలలో సేవలందిస్తూ జాతీయ స్థాయి స్వచ్ఛంద సంస్థగా మారిందని స్పష్టం చేసింది. దీని నిధుల సేకరణకు ఏడాది పొడుగునా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని, అందులో ప్రధానమైనది రన్ ఫర్ కాజ్ కార్యక్రమమని పేర్కొంది. ఈ కార్యక్రమానికి పదివేల మందికిపైగా హాజరవుతారని అంచనా వేసింది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్




