Harish Rao | ఉత్తమ్.. ఆ ఉత్తరం గుర్తుందా..?: హరీశ్‌రావు
Harish Rao | టీపీసీసీ (TPCC) అధ్యక్షుడిగా 30-03-2016న ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పీకర్ (Speaker)కు రాసి సంతకం పెట్టిన ఉత్తరం గుర్తుందా అని బీఆర్ఎస్ (BRS) శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు (Harish Rao) ప్రశ్నించారు.
Harish Rao | టీపీసీసీ (TPCC) అధ్యక్షుడిగా 30-03-2016న ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పీకర్ (Speaker)కు రాసి సంతకం పెట్టిన ఉత్తరం గుర్తుందా అని బీఆర్ఎస్ (BRS) శాసనసభాపక్ష ఉపనేత, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ప్రశ్నించారు. “అసెంబ్లీలో ఆడియో–విజువల్ ప్రెజెంటేషన్ నిర్వహిస్తే, అది భారత దేశ పార్లమెంట్ సంప్రదాయాలకు విరుద్ధం. అందుకే మేము సభకు హాజరుకాబోము” అని లేఖ రాశారని గుర్తు చేశారు. అదే ఉత్తమ్ నేడు మంత్రి హోదాలో అసెంబ్లీ హాల్లో ప్రజెంటేషన్‌కు సిద్ధపడటం, రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. ఆ ఉత్తరంపై నేటి ఉపముఖ్యమంత్రి (Deputy CM) అయిన భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), పద్మావతి కూడా సంతకాలు చేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అనైతికతను, ద్వంద్వ ప్రమాణాలను బట్టబయలు చేయడానికి ఈ ఒక్క ఉత్తరం చాలని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విలువలు, రాజ్యాంగం, పార్లమెంట్ స్పూర్తి లాంటి మాటలు వల్లెవేస్తారని, అధికారంలోకి రాగానే అదే విలువలకు తిలోదకాలు ఇస్తారని ఎద్దేవా చేశారు. ఇదే కాంగ్రెస్ పార్టీ అసలు నైజమని విమర్శించారు. ప్రజెంటేషన్‌కు అధికార పక్షానికి అనుమతి ఇస్తే బీఆర్ఎస్‌కూ అదే విధంగా అనుమతి ఇవ్వాలని బీఏసీ సమావేశంలో స్పీకర్‌ను, ఉత్తరం ద్వారా కూడా కోరామని చెప్పారు. అయినా ఆ అభ్యర్థనను తిరస్కరించారని పేర్కొన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి మధ్య ఉన్న అసలు తేడా అని వివరించారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ అన్ని సంప్రదాయాలు, పద్ధతులు, మర్యాదలకు భంగం కలిగిస్తూ, రాజ్యాంగానికే తూట్లు పొడవడాన్ని తన “మార్పు”గా చూపిస్తోందని ఆరోపించారు. ఆ “మార్పు” అసలు అర్థం ఏమిటో ప్రజలు ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారని చెప్పారు.

సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

Harish Rao | తెలంగాణ వాదులను గుండెల్లో పెట్టుకుంటా: హరీశ్ రావు
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



