Varanasi Movie | ప్రియాంక చోప్రాతో కలిసి డ్యాన్స్ చేసిన రాజమౌళి – స్టెప్పులు అదుర్స్ అంటూ నెటిజన్ల కామెంట్స్
వారణాసి మూవీ టీమ్ న్యూ ఇయర్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ వేడుకల్లో హీరోయిన్ ప్రియాంక చోప్రాతో కలిసి రాజమౌళి డ్యాన్స్ చేశారు. ప్రియాంకతో పోటీపడి స్టెప్పులతో అదరగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Entertainment | Published On Jan 3, 2026, 2.53 pm IST
Varanasi Movie | మహేష్‌బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న వారణాసి మూవీ కోసం వరల్డ్ వైడ్‌గా సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మైథలాజికల్ అంశాలతో టైమ్ ట్రావెల్, యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రాజమౌళి ఈ మూవీని రూపొందిస్తున్నారు. దాదాపు 1500 కోట్లతో టాలీవుడ్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా వారణాసి తెరకెక్కుతోంది.
ప్రియాంకతో స్టెప్పులు...
ప్రస్తుతం వారణాసి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా షూటింగ్‌కు స్మాల్ బ్రేక్ ఇచ్చారు రాజమౌళి. ఈ గ్యాప్‌లో మహేష్‌బాబు కుటుంబసభ్యులతో కలిసి ఫారిన్‌కు వెకేషన్‌కు వెళ్లారు.ప్రియాంక చోప్రా మాత్రం రాజమౌళి ఫ్యామిలీ మెంబర్స్‌తో న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఈ న్యూ ఇయర్ పార్టీలో ప్రియాంకతో కలిసి రాజమౌళి ఓ ఇంగ్లీష్ సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా ప్రియాంకతో సమానంగా రాజమౌళి స్టెప్పులు వేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజమౌళా మజాకా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రాజమౌళి సినిమాల్లో హీరోల కంటే ఆయనే డ్యాన్స్ అద్భుతంగా చేశారని పేర్కొంటున్నారు.గతంలో పలు ఫ్యామిలీ వేడుకల్లో తనలోని ఉన్న డ్యాన్స్ టాలెంట్‌ను బయటపెట్టారు రాజమౌళి. తెలుగు సూపర్ హిట్ సాంగ్స్ భార్య రమా రాజమౌళితో కలిసి ఆయన డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
వారణాసితో టాలీవుడ్‌లోకి ఎంట్రీ...
కాగా వారణాసి మూవీతోనే ప్రియాంక చోప్రా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇందులో మందాకిని అనే క్యారెక్టర్‌లో ప్రియాంక చోప్రా కనిపించబోతున్నది. డిసెంబర్‌లో జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ద్వారా వారణాసి టైటిల్‌తో పాటు మహేష్‌బాబు ఫస్ట్‌లుక్‌ను రాజమౌళి రిలీజ్ చేశారు. ఇందులో రుద్ర అనే ట్రావెలర్‌గా మహేష్‌బాబు నటిస్తున్నారు. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీలో విలన్‌గా కనిపించబోతున్నారు.వారణాసి మూవీని 2027లో వరల్డ్ వైడ్‌గా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు. ఇంగ్లీష్‌లో వారణాసి రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



