KCR | మళ్లీ యాక్టివ్ అయిన గులాబీ బాస్.. ఈనెల 27న బీఆర్ఎస్ నేతలతో కీలక భేటీ
KCR | బీఆర్ఎస్ పార్టీ (BRS party) పార్టీ అధినేత కేసీఆర్ (KCR) మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఈనెల 27వ తేదీన పార్టీ నేతలతో కీలక భేటీ నిర్వహించనున్నారు. పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించిన గులాబీ బాస్.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
KCR | బీఆర్ఎస్ పార్టీ (BRS party) రజతోత్సవ సంబురాల ముగింపును పురస్కరించుకొని పార్టీ అధినేత కేసీఆర్ (KCR) అధ్యక్షతన ఈనెల 27వ తేదీన ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఈ భేటీ జరగనుంది. పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించిన గులాబీ బాస్.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాల పునరుద్ధరణ వంటి అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ క్యాడర్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, సభ్యత్వ నమోదు ప్రక్రియను ఏ విధంగా వేగవంతం చేయాలి అనే విషయాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. వీటితో పాటు ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కూడా ఈ భేటీలో స్పష్టత రానుంది.
ఈ సమావేశానికి పార్టీకి చెందిన ముఖ్య నేతలందరినీ ఆహ్వానించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లను కూడా ఈ భేటీకి పిలిచినట్లు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ (KTR) ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read..
ఉపాధి హామీ కూలీ కుటుంబానికి ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయాలి : సీపీఐ నారాయణ
కేసీఆర్ స్పీచ్ లైవ్‌లో 36 లక్షల మంది చూస్తే.. రేవంత్ స్పీచ్‌కు 4 లక్షలే
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



