త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kite and Sweet Festival 2026 | 13 నుంచి ప‌రేడ్ గ్రౌండ్‌లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివ‌ల్

Kite and Sweet Festival 2026 | సంక్రాంతి పండుగ నేప‌థ్యంలో హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌రేడ్ గ్రౌండ్ కైట్ ఫెస్టివ‌ల్‌కు సిద్ధ‌మైంది. ఈ నెల 13 నుంచి 17వ తేదీ వ‌ర‌కు ప‌రేడ్ గ్రౌండ్‌లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివ‌ల్ నిర్వ‌హిస్తున్న‌ట్లు రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ప్ర‌క‌టించారు.

S

Telangana | Published On Jan 7, 2026, 2.44 pm IST

Kite and Sweet Festival 2026 | 13 నుంచి ప‌రేడ్ గ్రౌండ్‌లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివ‌ల్
Advertisement

Kite and Sweet Festival 2026 | త్రినేత్ర‌.న్యూస్ : సంక్రాంతి పండుగ నేప‌థ్యంలో హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌రేడ్ గ్రౌండ్ కైట్ ఫెస్టివ‌ల్‌కు సిద్ధ‌మైంది. ఈ నెల 13 నుంచి 17వ తేదీ వ‌ర‌కు ప‌రేడ్ గ్రౌండ్‌లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివ‌ల్ నిర్వ‌హిస్తున్న‌ట్లు రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ప్ర‌క‌టించారు. ఈ ఫెస్టివ‌ల్‌లో 19 దేశాల నుంచి 40 మంది అంత‌ర్జాతీయ కైట్ ఫ్ల‌య‌ర్స్, అదే విధంగా మ‌న దేశంలోని 15 రాష్ట్రాల‌కు చెందిన కైట్ ఫ్ల‌యర్స్ పాల్గొంటార‌ని మంత్రి పేర్కన్నారు.

కైట్ ఫెస్టివ‌ల్‌లో భాగంగా హాట్ఎయిర్ బెలూన్ షో నిర్వ‌హిస్తామ‌ని, ఇందుకు కోసం ఏవియేష‌న్ అనుమ‌తి తీసుకున్నామ‌ని మంత్రి జూప‌ల్లి తెలిపారు. జ‌న‌వ‌రి 16 నుంచి 18వ తేదీ వ‌ర‌కు కొన‌సాగే ఈ షో కోసం ఆన్‌లైన్‌లో బుకింగ్ సౌక‌ర్యం క‌ల్పించామ‌న్నారు. ఇక గ‌చ్చిబౌలి స్టేడియంలో 16, 17 తేదీల్లో నైట్ డ్రోన్ షోలు కూడా ఉంటాయ‌ని తెలిపారు. చెరువుల ప‌రిర‌క్ష‌ణ ల‌క్ష్యంగా న‌గ‌రంలోని అన్ని చెరువుల వ‌ద్ద కైట్ ఫెస్టివ‌ల్ కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌ని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఇక తెలంగాణ సంస్కృతి సంప్ర‌దాయాలు ఉట్టిప‌డేలా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌న్నారు. ప‌రేడ్ గ్రౌండ్‌లో సుమారు 100 వ‌ర‌కు హ్యాండ్లూమ్ స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తామ‌న్నారు. కైట్ ఫెస్టివ‌ల్ సంద‌ర్భంగా ఇదే ప‌రేడ్ గ్రౌండ్‌లో వివిధ రాష్ట్రాల‌కు చెందిన స్వీట్ స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement