యశ్ టాక్సిక్ బర్త్‌డే టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హాలీవుడ్ స్టైల్‌లో ఈ టీజర్ ఉందంటూ నెటిజన్లతో పాటు యశ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కేరళ ఫ్యాన్స్ మాత్రం టాక్సిక్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. యశ్ హీరోగా మలయాళ నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా టాక్సిక్ తెరకెక్కుతోంది. కేజీఎఫ్ 2 తర్వాత యశ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ కోసం సాండల్‌వుడ్, టాలీవుడ్‌తో పాటు అన్ని భాషల ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాయ...యశ్... యశ్ బర్త్‌డే సందర్భంగా అతడి క్యారెక్టర్‌ను పరిచయం గురువారం మేకర్స్ స్పెషల్ టీజర్‌ను విడుదల చేశారు. యాక్షన్ అంశాలతో స్టైలిష్‌గా ఈ టీజర్ సాగింది. రాయ అనే క్యారెక్టర్‌లో యశ్ కనిపించబోతున్నట్లు ప్రకటించారు. యశ్ లుక్, టీజర్‌లో అతడి ఎంట్రీ ఇచ్చే విధానం, విజువల్స్, బీజీఎమ్ అన్ని అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. డైరెక్టర్‌పై ట్రోల్స్... కానీ ఈ టీజర్‌లోని ఓ సీన్‌ను అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. మహిళలను కించపరిచేలా ఈ సీన్ ఉందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా సొంత రాష్ట్రం కేరళ నుంచే డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్‌కు ఎక్కువగా వ్యతిరేకత ఎదురవుతోంది. మహిళల రక్షణ కోసం మలయాళ ఇండస్ట్రీలో ఏర్పాటుచేసిన ఉమెన్స్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్ల్యూసీసీ )అసోసియేషన్‌లో గీతూ మోహన్‌దాస్ సభ్యురాలిగా ఉన్నారు. ఈ అసోసియేషన్ తరఫున మహిళలను అభ్యంతరకరంగా చూపించిన పలు సినిమాలపై గీతూ మోహన్ దాస్ గతంలో ఆరోపణలు చేశారు. మమ్ముట్టి కసబ సినిమాపై అప్పట్లో గీతూ మోహన్ దాస్ చేసిన కామెంట్లు ఇండస్ట్రీని కుదిపేశాయి. కసబ సినిమాలో హీరోగా నటించిన మమ్ముట్టిని హైలైట్ చేయడానికి హీరోయిన్‌ను బ్లర్ చేసినట్లుగా చూపించడంపై గీతూ మోహన్ దాస్ అగ్రహం వ్యక్తం చేసింది. టాక్సిక్ టీజర్‌తో ఆ వివాదం ఇప్పుడు తెరపైకి వచ్చింది. మమ్ముట్టి సినిమాలో మమ్ముట్టి సినిమాలో డైరెక్టర్ చేసింది తప్పైతే నువ్వు చేసింది ఏమిటి అంటూ నెటిజన్లు గీతూ మోహన్ దాస్‌పై ప్రశ్నిస్తున్నారు. ఇతరులు ఇలాంటి సీన్లు చేస్తే తప్పు...తన సినిమాలు ఉంటే రైట్...గీతూ మోహన్ దాస్ ద్వంద నీతిని ఫాలో అవుతుందని కసబ డైరెక్టర్ రెంజీ ఫణిక్కర్ కూడా కామెంట్స్ చేశాడు. ఫిమేల్ డైరెక్టర్ అయ్యిండి ఇలాంటి సీన్లు తీయడం కరెక్ట్ కాదని అంటున్నారు. భవిష్యత్తులో మహిళల హక్కుల గురించి ఆమెకు మాట్లాడే రైట్ కూడా లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. టాక్సిక్ మూవీలో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్‌తో పాటు తారా సుతారియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. హ్యుమా ఖురేషి కీలక పాత్రలో నటిస్తోంది. మార్చి 19న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.