త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

GHMC | న‌గ‌ర‌వాసుల‌కు జీహెచ్ఎంసీ తీపిక‌బురు..!

ZHMC | హైద‌రాబాద్ న‌గ‌ర‌వాసుల‌కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తీపిక‌బురు చెప్పింది. ఆస్తి ప‌న్ను బ‌కాయిల‌పై వ‌డ్డీ మాఫీతో వ‌న్‌టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్ కొన‌సాగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ స్కీమ్ కింద ఆస్తి ప‌న్ను బ‌కాయిల‌పై వ‌డ్డీలో 90శాతం మాఫీ వ‌ర్తించ‌నున్న‌ది.

P

Hyderabad | Published On Jan 8, 2026, 3.50 pm IST

GHMC | న‌గ‌ర‌వాసుల‌కు జీహెచ్ఎంసీ తీపిక‌బురు..!
Advertisement
  • 90శాతం వ‌డ్డీ మాఫీ వ‌న్‌టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్ గ‌డువు పొడిగింపు

GHMC | హైద‌రాబాద్ న‌గ‌ర‌వాసుల‌కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తీపిక‌బురు చెప్పింది. ఆస్తి ప‌న్ను బ‌కాయిల‌పై వ‌డ్డీ మాఫీతో వ‌న్‌టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్ కొన‌సాగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ స్కీమ్ కింద ఆస్తి ప‌న్ను బ‌కాయిల‌పై వ‌డ్డీలో 90శాతం మాఫీ వ‌ర్తించ‌నున్న‌ది. పన్ను చెల్లింపుదారులు పూర్తి ప్రిన్సిపల్ ట్యాక్స్‌తో పాటు కేవలం 10 శాతం వడ్డీ మాత్రమే ఒక్కసారి చెల్లిస్తే స‌రిపోతుంద‌ని న‌గ‌ర‌పాల‌క సంస్థ తెలిపింది. దీర్ఘ‌కాలంగా పెండింగ్‌లో ఉన్న ఆస్తి ప‌న్ను బ‌కాయిల‌ను సుల‌భంగా చెల్లించే వీలు క‌ల్పించింది.

ఈ మేర‌కు న‌గ‌ర ప్ర‌జ‌లు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకొని న‌గ‌ర అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది. వ‌డ్డీ మాఫీ స్కీమ్‌లో ప‌న్నును MyGHMC యాప్, మీ సేవ కేంద్రాలు, జీహెచ్ఎంసీ సిటిజన్ సర్వీస్ సెంటర్లు (CSCs), ఆన్‌లైన్ విధానంలో చెల్లించ‌వ‌చ్చ‌ని తెలిపింది. స‌కాలంలో ఆస్తి ప‌న్ను చెల్లించ‌డం ద్వారా న‌గ‌ర మౌలిక స‌దుపాయాలు, పౌర సేవ‌లు మ‌రింత బ‌లోపేత‌మ‌వుతాయ‌ని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement