Lover Suicide | ప్రేమించానన్నాడు.. ఫోన్‌లో మరెవరితోనో మాట్లాడుతున్నావని అనుమానించాడు.. తర్వాత ఏమైందంటే?
Lover Suicide | వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు (Lover Suicide). కలిసి తిరిగారు. పెండ్లి చేసుకుంటామని ఇరు కుటుంబాల్లో చెప్పారు. మొదట్లో తిరస్కరించినా.. తర్వాత ఒప్పుకున్నారు. ఇక కలిసి జీవించడమే తరువాయి అనుకుంటుండగా.. అతడు తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు.
trinethra.news: వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు (Lover Suicide). కలిసి తిరిగారు. పెండ్లి చేసుకుంటామని ఇరు కుటుంబాల్లో చెప్పారు. మొదట్లో తిరస్కరించినా.. తర్వాత ఒప్పుకున్నారు. ఇక కలిసి జీవించడమే తరువాయి అనుకుంటుండగా.. అతడు తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. తనతో కాకుండా మరెవరితోనే మాట్లాడుతున్నావంటూ అనుమానించాడు. దీంతో మనోవేదనతో ఆ యువతి ప్రేమికుడి ముందే ఆత్మహత్యకు (Suicide Attempt) పాల్పడింది. దవాఖానలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ ఘటన హైదరాబాద్ నాగోలు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణానికి చెందిన ఐశ్వర్య (19) అనే యువతి తన సోదరుడు అరవింద్‌తో కలిసి హైదరాబాద్ నాగోలు సమీపంలోని తట్టిఅన్నారం వైఎస్ఆర్ కాలనీలో ఓ ఇంట్లో ఉంటున్నది. ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలో పనిచేస్తున్నది. అన్న ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. వారి దూరపు బంధువైన మహేష్ అలియాస్ ఆనంద్ (23) నగరంలోని హస్తినాపురంలో ఉంటూ ఆటో నడుపుతున్నాడు.
ఏడాదిక్రితం జరిగిన అయ్యప్ప పూజలో ఐశ్వర్యను చూసిన మహేశ్.. బంధుత్వం పేరుతో తరచూ వారి ఇంటికి వచ్చిపోయేవాడు. ఇటీవల తనను ప్రేమిస్తున్నానని ఆమెతో చెప్పాడు. పెండ్లి చేసుకుంటానంటూ వెంటపడటంతో ఆమె ఓకే చెప్పింది. ఇరువురి వివాహానికి మొదట పెద్దలు నిరాకరించినా.. తరువాత అంగీకరించారు. పెండ్లి కూడా కుదరడంతో ఇటీవల ఆమెతో చనువుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆమె మరెవరితోనో ఫోన్‌లో తరచూ మాట్లాడుతున్నదని అనుమానం పెంచుకు న్నాడు.
ఈ నెల 5న తాము తరచూ కలుసుకునే హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకున్నారు. ఫోన్ల విషయమై ఆనంద్ ఆమెను నిలదీశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఐశ్వర్య.. వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి దూకేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను నాగోలులోని ఓ దవాఖానలో చేర్పించారు. అయితే పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందింది.
తమ కూతురు ఆత్మహత్యకు కారణమైన మహేశ్‌పై ఐశ్వర్య తల్లిదండ్రులు నాగోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదుచేసి.. నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





