Dasoju Sravan Kumar | రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ గద్ద అవతారం ఎత్తిండు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
Dasoju Sravan Kumar | రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ గద్ద అవతారం ఎత్తారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. తెలంగాణ భవనల్‌లో గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. విద్యాశాఖ మంత్రిగా ఉండి యూనివర్సిటీల భూములు అమ్ముకోవాలనే రేవంత్ వైఖరి దుర్మార్గమని, వేల ఎకరాలు హస్తగతం చేసుకునే పనిలో పడిన రేవంత్ రెడ్డి.. లైసెన్స్ దోపిడికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
Dasoju Sravan Kumar | రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ గద్ద అవతారం ఎత్తారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. తెలంగాణ భవనల్‌లో గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. విద్యాశాఖ మంత్రిగా ఉండి యూనివర్సిటీల భూములు అమ్ముకోవాలనే రేవంత్ వైఖరి దుర్మార్గమని, వేల ఎకరాలు హస్తగతం చేసుకునే పనిలో పడిన రేవంత్ రెడ్డి.. లైసెన్స్ దోపిడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఉర్దూ విశ్వవిద్యాలయానికి చెందిన భూములను 50 ఎకరాలు దండుకోవాలని ప్రభుత్వం చూస్తోందని, రియల్ ఎస్టేట్ మాఫియాలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
ఐఎస్బీ భూములకు కూడా నోటీసులు ఇచ్చినట్లు తెలిసిందని, భూములు అమ్మి ముఖ్యమంత్రి పదవి వెలగబెట్టల్సిన అవసరం లేదన్నారు. చేతగాక పోతే రేవంత్ రెడ్డి పదవి నుంచి దిగిపోవాలని, రేవంత్ స్థానంలో ఎవరు సీఎంగా ఉన్నా రాష్ట్రాన్ని బాగానే పాలిస్తారన్నారు. యూనివర్సిటీ భూములు అమ్మే వ్యక్తి రాష్ట్రానికి సీఎం గా అవసరం లేదన్నారు. విశ్వవిద్యాలయ భూముల స్వాధీనం విషయంలో కేబినెట్‌లో చర్చించారా..? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తోటమాలి లాంటి వారు మాత్రమేనని, ఇష్టం వచ్చినట్లు భూములు అమ్ముతామంటే ఎలా? అంటూ మండిపడ్డారు. సరస్వతి తల్లితో రేవంత్ రెడ్డి ఆటలాడుతున్నారన్నారు. ముస్లింల గురించి గొప్పగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెబుతుందని.. ఉర్దూతో, ఉర్దూ అభ్యసించే విద్యార్థులతో కాంగ్రెస్ పార్టీ ఆడుకుంటోందన్నారు.
ముస్లిం సమాజం మొత్తం తిరగబడాల్సిన అవసరం ఉందన్నారు. ఉర్దూ విశ్వవిద్యాలయానికి ఇచ్చిన నోటీసు ఉపసంహరించుకోవాలని, రియల్ ఎస్టేట్ దందాలు మానుకోవాలని సీఎం, మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు. కంచె గచ్చి బౌలి భూముల విషయంలో విద్యార్థులకు బీఆర్ఎస్ అండగా ఉన్నట్టే ఉర్దూ యూనివర్సిటీ భూముల రక్షణ విషయం లో అండగా ఉంటుందని స్పష్టం చేశారు. భూములు అమ్ముకోవాంటే వేరే చోట అమ్ముకోవచ్చని, యూనివర్సిటీల జోలికి రావొద్దని హితవు పలికారు. మౌలానా ఉర్దూ యూనివర్సిటీలో 26 విభాగాలు ఉన్నాయని, వాటికి ఉన్న భూమే సరిపోదన్నారు. ప్రభుత్వం ఉర్దూ యూనివర్సిటీ అభివృద్ధికి వెయ్యి కోట్లు కేటాయించాలని కోరారు. సమావేశంలో కే వాసుదేవరెడ్డి, కురవ విజయ్ కుమార్ పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



