త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

WPL 2026 | వుమ‌న్స్ ప్రీమియ‌ర్ లీగ్‌కు రెడీ.. టోర్నీ పూర్తి షెడ్యూల్ ఇదే..!

WPL 2026 | వుమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్‌-2026 సీజ‌న్‌కు రంగం సిద్ధ‌మైంది. పొట్టి క‌ప్ టోర్నీ జ‌న‌వ‌రి 9న మొద‌లై ఫిబ్ర‌వ‌రి 5 వ‌ర‌కు కొన‌సాగ‌నున్న‌ది. న‌వీ ముంబ‌యి, బ‌రోడా వేదిక‌గా మ్యాచులు జ‌రుగ‌నున్నాయి. నాలుగు వారాల పాటు ఈ టోర్నీలో మొత్తం 22 మ్యాచులు జ‌రుగుతాయి.

P

Sports | Published On Jan 8, 2026, 6.21 pm IST

WPL 2026 | వుమ‌న్స్ ప్రీమియ‌ర్ లీగ్‌కు రెడీ.. టోర్నీ పూర్తి షెడ్యూల్ ఇదే..!
Advertisement

WPL 2026 | వుమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్‌-2026 సీజ‌న్‌కు రంగం సిద్ధ‌మైంది. పొట్టి క‌ప్ టోర్నీ జ‌న‌వ‌రి 9న మొద‌లై ఫిబ్ర‌వ‌రి 5 వ‌ర‌కు కొన‌సాగ‌నున్న‌ది. న‌వీ ముంబ‌యి, బ‌రోడా వేదిక‌గా మ్యాచులు జ‌రుగ‌నున్నాయి. నాలుగు వారాల పాటు ఈ టోర్నీలో మొత్తం 22 మ్యాచులు జ‌రుగుతాయి. డిపెండింగ్ చాంపియ‌న్‌గా ముంబ‌యి బ‌రిలోకి దిగుతున్నది. ఇప్ప‌టి వ‌ర‌కు రెండుసార్లు ముంబ‌యి డ‌బ్ల్యూపీఎల్ టైటిల్స్ సాధించ‌గా.. రాయ‌ల్స్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఒక‌సారి విజేత‌గా నిలిచింది. ఇక ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, గుజ‌రాత్ జెయింట్స్, యూపీ వారియ‌ర్స్‌ క‌ప్ కోసం నిరీక్షిస్తున్నాయి.

గ‌తేడాది కంటే భిన్నంగా..

డ‌బ్ల్యూపీఎల్ గ‌త మూడు సీజ‌న్ల కంటే భిన్నంగా ఉండ‌నున్న‌ది. గ‌తేడాది జ‌రిగిన ఐసీసీ ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమిండియా విజేత‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా వుమెన్స్ క్రికెట్‌కు భారీ ఆద‌ర‌ణ ల‌భించింది. పెద్ద ఎత్తున అభిమానులు త‌ర‌లివ‌చ్చారు. హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ, షఫాలీ వర్మ భార‌త వుమెన్స్ క్రికెట్‌కు ఐకాన్స్‌గా నిలిచారు. 2007లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ విజ‌యం త‌ర్వాత ఐపీఎల్ వుమెన్స్ క్రికెట‌ర్ల త‌ల‌రాత‌ను మార్చేసింది. వుమెన్స్ జ‌ట్టును సైతం విశ్వ‌విజేత‌గా నిలువ‌డంతో ఈ లీగ్‌పై అంద‌రి దృష్టి నెల‌కొన్న‌ది.

యంగ్ ప్లేయ‌ర్స్‌కు మంచి అవ‌కాశం..

2026లో ఇంగ్లాండ్‌లో మహిళల టీ20 ప్రపంచ కప్ జ‌ర‌గాల్సి ఉంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్లేయ‌ర్లు స‌న్న‌ద్ధ‌మ‌య్యేందుకు వేదిక‌గా నిలువ‌నున్న‌ది. టోర్నీలో ప్ర‌ద‌ర్శ‌న ఆధారంగా జాతీయ జ‌ట్టుకు ఎంపిక‌య్యే అవ‌కాశాలున్నాయి. గత సీజన్‌లో క్రాంతి గౌడ్, కాశ్వి గౌతమ్, శ్రీ చరణి వంటి యువ ప్లేయ‌ర్లు వెలుగులోకి వ‌చ్చారు. తాజాగా మ‌రికొంద‌రు వెలుగులోకి వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని భావిస్తున్నారు. ఈ క్రికెట్‌లో డ‌బ్ల్యూపీఎల్ కేవ‌లం ఓ లీగ్ మాత్ర‌మే కాకుండా.. భ‌విష్య‌త్ క్రికెట‌ర్ల‌ను త‌యారు చేసే ఫ్యాక్ట‌రీగా మారింది.

మ్యాచులు ఇలా..

ఇక డ‌బ్ల్యూపీఎల్ మ్యాచులు భార‌త కాల‌మానం ప్ర‌కారం.. డే మ్యాచ్ మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు, నైట్ మ్యాచ్‌లు రాత్రి 7.30 గంట‌ల‌కు మొద‌ల‌వుతాయి. టాస్ కార్య‌క్ర‌మం అర‌గంట ముందుగా అంటే మ‌ధ్యాహ్నం 3, రాత్రి 7 గంట‌ల‌కు గంట‌ల‌కు జ‌రుగుతుంది. ఇక ఈ లీగ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వ‌ర్క్ ప్ర‌సారం చేయ‌నున్న‌ది. జియో హాట్‌స్టార్‌లో సైతం లైవ్ స్ట్రీమింగ్ జ‌రుగుతుంది.

ఆ జ‌ట్టు నేరుగా ఫైన‌ల్‌కు..

వుమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్ గ‌త ఎడిష‌న్‌లో ముంబ‌యి ఇండియ‌న్ విజేత‌గా నిలిచింది. 2024 సీజ‌న్‌లో బెంగ‌ళూరు టైటిల్‌ను నెగ్గింది. ఇక ఈ ఏడాది ఏ జ‌ట్టు గెలుస్తుంద‌నేది ఆస‌క్తి నెల‌కొన్న‌ది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచే జ‌ట్టు ఎలిమినేట‌ర్‌లో త‌ల‌ప‌డుతాయి.

జ‌ట్లు ఇవే..

ముంబ‌యి ఇండియ‌న్స్ : హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జీ కమలిని (వికెట్ కీపర్), రహిలా ఫిర్దౌస్ (వికెట్ కీపర్), హేలీ మాథ్యూస్, అమంజోత్ కౌర్, అమేలియా కెర్, నాట్ స్కివర్ బ్రంట్, నికోలా కారీ, షబ్నిమ్ ఇస్మాయిల్, పూనమ్ ఖెన్‌మార్, మిల్లీ ఇల్లింగ్‌వ‌ర్త్‌, ఎస్ స‌జ‌న‌, సంస్కృతి గుప్తా, సాయకా ఇషాక్, క్రాంతి రెడ్డి, త్రివేణి వశిష్ట్.

ఆర్‌సీబీ : స్మృతి మంధాన, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జార్జియా వాల్, గౌతమి నాయక్, గ్రేస్ హారిస్, నాడిన్ డీ క్లెర్క్, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, అరుంధతి రెడ్డి, లారెన్ బెల్, డీ హేమలత, ఎల్సీ పెర్‌ప్లాస్‌ట్‌, ఎల్‌సీ పెర్‌ప్లాస్‌ట్‌ లిన్సే స్మిత్, కుమార్ ప్రత్యూష. ఎల్లీస్ పెర్రీ వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో త‌ప్పుకోవ‌డంతో స‌యాలీ స‌త్‌ఘ‌రేను తీసుకున్నారు.

ఢిల్లీ క్యాపిట‌ల్స్ : జెమిమా రోడ్రిగ్స్ (కెప్టెన్), తాన్యా భాటియా (వికెట్ కీపర్), ఎం మమత (వికెట్ కీపర్), ఎల్ వోల్వార్డ్, షఫాలి వర్మ, మారిజాన్ కాప్, చినెల్లె హెన్రీ, లిజెల్ లీ, ఎలానా కింగ్, లూసీ హామిల్టన్, స్నేహి, స్నేహ్ రాణా, స్నేహ్ రానా, మిన్ను ప్రసాద్ నందనీ శర్మ. అయితే, అన్నాబెల్ స‌ద‌ర్లాండ్ స్థానంలో ఎలానా కింగ్స్‌ను జ‌ట్టులోకి తీసుకున్నారు.

యూపీ వారియర్స్ : మెగ్ లానింగ్ (కెప్టెన్), శ్వేతా సెహ్రావత్ (వికెట్ కీపర్), షిప్రా గిరి (వికెట్ కీపర్), కిరణ్ నవ్‌గిరే, హర్లీన్ డియోల్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, దీప్తి శర్మ, డియాండ్రా డోటిన్, సోఫీ ఎక్లెస్‌స్టోన్, ఆశా శోభనా జాయ్, కె సిమ్‌వాల్ గోయ్, శిఖా రౌడీ, శిఖా రౌడీ క్లో ట్రయాన్, జీ త్రిష, సుమన్ మీనా, చార్లీ నాట్. తానా నోరీస్ స్థానంలో చార్లీనాట్ జ‌ట్టులోకి వ‌చ్చింది.

గుజరాత్ జెయింట్స్: ఆష్లీ గార్డ్నర్ (కెప్టెన్), బెత్ మూనీ (వికెట్ కీపర్), య‌స్తికా భాటియా (వికెట్ కీపర్), శివానీ సింగ్ (వికెట్ కీపర్), డాని వ్యాట్-హాడ్జ్, సోఫీ డివైన్, జార్జియా వేర్‌హామ్, కిమ్ గార్త్, రేణుకా సింగ్ ఠాకూర్, టైటాస్ సాధు, తనుజా కన్వర్, కాశ్వి గౌతమ్, కనికా అహుజా, రాజేశ్వరి గయాక్వాడ్, భారతి ఫుల్మాలి, హ్యాపీ కుమార్, అనుష్క శర్మ, ఆయుషి సోని.

Advertisement

తాజావార్తలు

Advertisement