Heatwave | భానుడి భగభగలు.. తెలంగాణలో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
Heatwave | తెలంగాణ రాష్ట్రంలో ఎండతీవ్రత విపరీతంగా పెరిగింది. నేడు ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో 40 నుంచి 41 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Heatwave | దేశంలో ఈ ఏడాది ఎండల తీవ్రత (Heatwave) మునుపెన్నడూ లేని విధంగా ముందే మొదలైంది. వేసవి కాలం పూర్తిగా రాకముందే దేశవ్యాప్తంగా సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తెలంగాణ (Telangana) రాష్ట్రంలోనూ ఎండతీవ్రత విపరీతంగా పెరిగింది. నేడు ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో 40 నుంచి 41 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ (Hyderabad) నగరంలోనూ ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎండ తీవ్రత పెరిగింది. అనంతపురం, కర్నూలు, కడప, తిరుపతి, అమరావతి, విశాఖ సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్ దాటాయి. సాధారణం కంటే రెండు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల వరకూ పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక దేశ వ్యాప్తంగానూ భానుడు ప్రతాపం చూపుతున్నాడు. గత 15 ఏళ్లలో ఎన్నడూ లేనంత ముందుగానే ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటినట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
Also Read..
Daniel Vettori | పాక్ ప్లేయర్‌ను కొనడంపై వివరణ ఇచ్చిన సన్ రైజర్స్ కోచ్
Harish Rao | రాజ్యాంగాన్ని రక్షించడమంటే ఇదేనా..? రాహుల్ గాంధీకి హరీశ్‌రావు లేఖ
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





