Harish Rao | రాజ్యాంగాన్ని రక్షించడమంటే ఇదేనా..? రాహుల్ గాంధీకి హరీశ్‌రావు లేఖ
Harish Rao | బహిరంగంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చీట్ ఇవ్వడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : బహిరంగంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చీట్ ఇవ్వడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ అంశాన్ని లేవనెత్తుతూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు.
రాజ్యాంగాన్ని రక్షించడానికి పోరాడుతున్నానని చెబుతూ దేశ వ్యాప్తంగా పర్యటిస్తారు. పార్లమెంటులో, బహిరంగ సభల్లో, రాజకీయ సభల్లో మాట్లాడుతూ.. రాజ్యాంగ విలువలను పరిరక్షించడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం అని చెబుతారు. అంతేకాకుండా పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని 2024 ఎన్నికల సందర్భంగా మీ పార్టీ మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు. అయితే మీరు చెబుతున్న దానికి, తెలంగాణ జరుగుతున్న పరిణామాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్‌పై గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్‌పై లోక్‌సభ ఎన్నికల్లో బహిరంగంగా పోటీ చేశారు. ఇవి ఊహగానాలు కాదు.. పుకార్లు కావు.. స్పష్టంగా పబ్లిక్ రికార్డుకు సంబంధించిన విషయం. అయినప్పటికీ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఆధారాలు లేవని శాసనసభ స్పీకర్ పేర్కొన్నారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో బీ ఫామ్‌పై ఎన్నికల్లో పోటీ చేయడం ఫిరాయింపులకు నిదర్శనం కాదా..? కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఇలాగే రక్షిస్తుందా..? మీరు ఈ దేశానికే చెప్పే రాజ్యాంగ నైతికత ఇదేనా..? ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అవకాశవాదం కోసం వాడుకుంటున్నారు. స్పీకర్ తీర్పును మీరు సమర్ధిస్తారా? లేక దానం నాగేందర్‌పై చర్యలకు ఆదేశిస్తారా? అని లేఖలో హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



