KTR | ఒత్తిడికి గురికాకండి.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి : పది విద్యార్థులకు కేటీఆర్ ఆల్‌ది బెస్ట్
KTR | రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు (SSC Exams) ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు (students) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆల్‌ది బెస్ట్ చెప్పారు.
KTR | రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు (SSC Exams) ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు (students) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆల్‌ది బెస్ట్ చెప్పారు. ఈ పరీక్షల్లో ప్రతీ విద్యార్థి ప్రతిభ కనబర్చి, విజయం సాధిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. జీవితంలో మొదటి పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నందున.. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు.
https://x.com/KTRBRS/status/2032343596804755507
కాగా, రేపటి (మార్చి 14) నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 16న పరీక్షలు అయిపోతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5.27 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 517,727 మంది, మరో 10,512 మంది ప్రైవేట్ స్టూడెంట్స్ ఉన్నారు. వీరికోసం 2,676 పరీక్షా కేంద్రాలను విద్యాశాఖ ఏర్పాటు చేసింది.
విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు కనీసం అరగంట ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 9.35 గంటల వరకు పరీక్షా కేంద్రాల్లో అనుమతిస్తామని చెప్పారు. ఆ తర్వాత వచ్చేవారిని అనుమతించేంది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పరీక్షకు ఒక రోజు ముందుగానే విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలన్నారు.
Also Read..
అలా చేస్తే మహిళల్ని ఎవరూ ఉద్యోగాల్లోకి తీసుకోరు.. నెలసరి సెలవులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
అడోబ్ సీఈవో పదవికి శాంతను నారాయణ్ రాజీనామా.. కారణం ఏమిటి..?
తాజావార్తలు
- ●Smriti Irani | రాజ్యసభకు మళ్లీ వరుణ్ గాంధీ, స్మృతి ఇరానీ..!
- ●Hyderabad Theatre | 22 నిమిషాలు ఆలస్యంగా సినిమా ప్రారంభం.. థియేటర్‌కు రూ. 75 వేలు జరిమానా
- ●TOSS | అక్టోబర్ 11 నుంచి ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్
- ●Murder | నలుగురు పిల్లల తల్లికి వేధింపులు.. పుట్టింటికి పిలిచి చున్నీతో ఉరేసిన వివాహిత
- ●KTR | కేటీఆర్ పాస్‌పోర్ట్ సీజ్..!
- ●Horoscope | సెప్టెంబర్ 29 రాశిఫలాలు.. మీ రాశిఫలం ఎలా ఉందంటే..?

Smriti Irani | రాజ్యసభకు మళ్లీ వరుణ్ గాంధీ, స్మృతి ఇరానీ..!

Hyderabad Theatre | 22 నిమిషాలు ఆలస్యంగా సినిమా ప్రారంభం.. థియేటర్‌కు రూ. 75 వేలు జరిమానా

TOSS | అక్టోబర్ 11 నుంచి ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్

Murder | నలుగురు పిల్లల తల్లికి వేధింపులు.. పుట్టింటికి పిలిచి చున్నీతో ఉరేసిన వివాహిత




