Distance Degrees | ఆ వర్సిటీల డిగ్రీలు ఇక్కడ చెల్లవు.. ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కాదు..
Distance Degrees | రెగ్యులర్ కోర్సులు చేయడానికి పరిస్థితులు అనుకూలించక, ఆర్థిక కారణాలతో చాలా మంది దూరవిద్యలో (Distance Degrees) అభ్యసనం సాగిస్తూ.. భవిష్యత్‌పై కోటి ఆశలు పెట్టుకుంటారు. ఏదో పనిచేసుకుంటూ డిస్టెన్స్‌లో డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతూ ఉంటారు.
Distance Degrees | త్రినేత్ర.న్యూస్: రెగ్యులర్ కోర్సులు చేయడానికి పరిస్థితులు అనుకూలించక, ఆర్థిక కారణాలతో చాలా మంది దూరవిద్యలో (Distance Degrees) అభ్యసనం సాగిస్తూ.. భవిష్యత్‌పై కోటి ఆశలు పెట్టుకుంటారు. ఏదో పనిచేసుకుంటూ డిస్టెన్స్‌లో డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతూ ఉంటారు. అలాంటి వారికి హైకోర్టు (High Court) షాకిచ్చింది. యూనివర్సిటీ (University) ఏదైతేనేం.. మొత్తానికి మా డిగ్రీ పూర్తయి పోయింది అనుకునేవారికి ఇకపై అలాంటివి కుదరదని స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాలకు చెందిన విశ్వవిద్యాలయాలు తమ రాష్ట్ర సరిహద్దులు దాటి నిర్వహిస్తున్న స్టడీ సెంటర్ల ద్వారా పొందే డిగ్రీలు ప్రభుత్వ ఉద్యోగాలకు (Government Jobs) పనికిరావని తేల్చి చెప్పింది. తప్పనిసరిగా ఆయా రాష్ట్రాలకు చెందిన వర్సిటీలు, స్టడీ సెంటర్లలోనే పట్టా పొంది ఉండాలని పేర్కొంది.
అసలు ఏం జరిగిందంటే..
2022లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) లైబ్రేరియన్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో పలువురు ఆంధ్రప్రదేశ్‌లోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ పూర్తి చేశారు. ఏపీలో కాకుండా తెలంగాణలో ఉన్న ఆ వర్సిటీ స్టడీ సెంటర్ల ద్వారా దూరవిద్యా విధానంలో సర్టిఫికెట్ పొందారు. ధృవపత్రాల వెరిఫికేషన్ సమయంలో వీరి డిగ్రీలు చెల్లవని టీజీపీఎస్సీ తిరస్కరించింది. దీంతో ఆ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో కూడా పలువురు ఇలా ఉద్యోగాలు పొందారిని వాదనలు వినిపించారు.
ప్రాదేశిక అధికార పరిధి దాటకూడదు..
ఈ కేసును విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం.. ఒక రాష్ట్ర చట్టం కింద ఏర్పడిన విశ్వవిద్యాలయం తన కార్యకలాపాలను ఆ రాష్ట్ర సరిహద్దులకే పరిమితం చేయాలని వ్యాఖ్యానించింది. ఇతర రాష్ట్రాల్లో స్టడీ సెంటర్లు పెట్టి డిగ్రీలు ఇవ్వడం యూజీసీ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. ఏ వర్సిటీ అయినా తన ప్రాదేశిక అధికార పరిధిని దాటి వెళ్లకూడదని యూజీసీ 2013లో జారీచేసిన పబ్లిక్ నోటీసుల్లో స్పష్టం చేసిందని తెలిపింది. దీని ప్రకారం తెలంగాణలో ఏపీ వర్సిటీ స్టడీ సెంటర్లు నిర్వహించడం చట్టవిరుద్ధమని తీర్పునిచ్చింది.
Read Also..
ఆర్టీసీ సమ్మె విరమణ.. ఇక రోడ్డెక్కనున్న బస్సులు
నా టార్గెట్ డాడీ.. మోడీ.. కచ్చితంగా సీఎం అవుతా..!
కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన సభకు అట్టహాసంగా ఏర్పాట్లు..
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






