త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Age Relaxation | 34 నుంచి 44 ఏండ్ల‌కు.. ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు గ‌రిష్ట‌ వ‌యోప‌రిమితి పెంపు

Age Relaxation | ఉద్యోగార్థుల‌కు ప్ర‌భుత్వం శుభవార్త అందించింది. ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు పోటీప‌డేవారికి గ‌రిష్ట వ‌యోప‌రిమితిని (Age Relaxation) 34 ఏండ్ల నుంచి 44 ఏండ్ల‌కు పెంచింది.

G

Telangana | Published On May 19, 2026, 10.22 am IST

Age Relaxation | 34 నుంచి 44 ఏండ్ల‌కు.. ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు గ‌రిష్ట‌ వ‌యోప‌రిమితి పెంపు
Advertisement

Age Relaxation | త్రినేత్ర‌.న్యూస్‌: ఉద్యోగార్థుల‌కు ప్ర‌భుత్వం శుభవార్త అందించింది. ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు పోటీప‌డేవారికి గ‌రిష్ట వ‌యోప‌రిమితిని (Age Relaxation) 34 ఏండ్ల నుంచి 44 ఏండ్ల‌కు పెంచింది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీచేసింది. అయితే ఈ పెంపు ఏడాదిపాటు మాత్ర‌మే వ‌ర్తిస్తుంద‌ని, యూనిఫామ్ స‌ర్వీసుల‌కు దీనిని మిన‌హాయింపు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. దీనికి సంబంధించి పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉన్న‌ది.

గ‌తంలో 2022లో ఇచ్చిన ప‌దేండ్ల వ‌యో స‌డ‌లింపు గ‌డువు ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ముగిసిపోయింది. దీంతో ఉద్యోగార్థులు మ‌రోసారి ప‌యోప‌రిమితి పెంచాలంటూ డిమాండ్ చేస్తుండ‌టంతో ప్ర‌భుత్వం ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ది. కాగా, కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి రెండున్న‌ర ఏండ్లు గ‌డుస్తున్న‌ప్ప‌టికీ కొత్త‌గా ఒక్క నోటిఫికేష‌న్ కూడా విడుద‌ల చేయ‌లేదు. గ‌త ప్ర‌భుత్వం ఇచ్చిన నోటిఫికేష‌న్ల‌ను ర‌ద్దు చేసి కొత్త‌గా ఇచ్చిందే మిన‌హా ఇప్ప‌టి వ‌ర‌కు ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌లేదు. ఉద్యోగాల భ‌ర్తీపై ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న‌ట‌లు లేక‌పోవ‌డంతో తాజాగా ఏడాది పాటు మాత్ర‌మే ఇచ్చే స‌డ‌లింపు ఎంత‌వ‌ర‌కు ఉప‌యోగప‌డుతుంద‌ని నిరుద్యోగులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement