HMWSSB | జలమండలిలో ఎలాంటి నియామకాల్లేవు.. అది అసత్య ప్రచారమే..
HMWSSB | జలమండలిలో ఉద్యోగ నియామకాలంటూ సోషల్ మీడియాలో వైరలవుతున్న వార్తలపై జలమండలి స్పందించింది. ప్రస్తుతం జలమండలిలో ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని స్పష్టం చేసింది.
HMWSSB | త్రినేత్ర.న్యూస్ : జలమండలిలో ఉద్యోగ నియామకాలంటూ సోషల్ మీడియాలో వైరలవుతున్న వార్తలపై జలమండలి స్పందించింది. ప్రస్తుతం జలమండలిలో ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని స్పష్టం చేసింది. ఉద్యోగ నియామకాలు చేపట్టే అవకాశం ఉంటే.. కేవలం టీజీపీఎస్సీ లేదా అధికారిక సంస్థల ద్వారానే ప్రకటనలు వెలువడుతాయని తేల్చిచెప్పింది. సోషల్ మీడియా వేదికగా “హైదరాబాద్ నీటి సరఫరా బోర్డు, తెలంగాణ రిక్రూట్మెంట్ 2026” పేరుతో వైరలవుతున్న పోస్టర్ అసత్యమని జలమండలి స్పష్టం చేసింది.
ఆ పోస్టర్‌లో జలమండలిలో భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు, వేతనాలు, అర్హతల వివరాలు పేర్కొంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పోస్టర్‌లో పేర్కొన్న విధంగా ఎలాంటి నియామక ప్రక్రియను జలమండలి చేపట్టలేదు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సమాచారం పూర్తిగా అసత్యం.. ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది.
జలమండలిలో ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సి వచ్చిన సందర్భంలో, అవి ప్రభుత్వ నిబంధనల ప్రకారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) లేదా సంబంధిత అధికారిక సంస్థల ద్వారా మాత్రమే నిర్వహించబడతాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు ప్రభుత్వ, జలమండలి అధికారిక వెబ్‌సైట్లు, విశ్వసనీయ మీడియా వేదికల ద్వారా విడుదల చేయబడతాయి. కావున ప్రజలు, ఉద్యోగార్థులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నిర్ధారణ లేని పోస్టర్లు, వార్తలు, తప్పుడు ప్రకటనలను నమ్మవద్దని జలమండలి విజ్ఞప్తి చేస్తోంది. అధికారిక సమాచారం కోసం మాత్రమే ప్రభుత్వ, జలమండలి అధికారిక ప్రకటనలను అనుసరించాలి అని జలమండలి విజ్ఞప్తి చేసింది.

సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



