Bandi Bhageerath | బండి భగీరథ్ సంచలన నిర్ణయం.. కోర్టు తీర్పునకు ముందే..
Bandi Bhageerath | పోక్సో కేసులో (POCSO case) అరెస్టయిన బండి భగీరథ్ (Bandi Bhageerath) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు బెయిల్ కోసం (anticipatory bail) హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను (petition withdrew) ఉపసంహరించుకున్నారు.
Bandi Bhageerath | త్రినేత్ర.న్యూస్: పోక్సో కేసులో (POCSO Case) అరెస్టయిన బండి భగీరథ్ (Bandi Bhageerath) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు బెయిల్ కోసం (Anticipatory bail) హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను (Petition Withdrew) ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు అనుమతి కోరుతూ హైకోర్టు (High Court) రిజిస్ట్రీకి మెమోను సమర్పించారు. బెయిల్ విషయంలో తదుపరి ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొన్నారు. దీంతో గురువారం పిటిషన్ ఉపసంహరణ కోసం రిజిస్ట్రీ లిస్ట్ చేసినట్లు తెలిసింది. కాగా, ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు గురువారం (మే 21న) తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో పిటిషన్‌ను ఉపసంహరించుకోవడం గమనార్హం.
నేడు తీర్పు.. అంతలోనే..
ఈ నెల 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పరారీలో ఉన్న ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి ముందస్తు బెయిల్‌కు నిరాకరించారు. ఈ నెల 15న ఇరుపక్షాల వాదన విన్న తర్వాత ఈ పరిస్థితుల్లో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని, తదుపరి విచారణలో తుది తీర్పునిస్తామని రిజర్వు చేస్తూ మే 21కి వాయిదా వేశారు. ఆ మరుసటి రోజే పలు నాటకీయ పరిణామాల మధ్య భగీరథ్ రాజేంద్రనగర్‌లో పోలీసులకు లొంగిపోయారు. దీంతో మేడ్చల్ మేజిస్ట్రేట్ ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న భగీరథ్‌ను విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని కోరేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



