Kalvakuntla Kavitha | నా టార్గెట్ డాడీ.. మోడీ.. కచ్చితంగా సీఎం అవుతా..!
Kalvakuntla Kavitha | ప్రజా ఆకాంక్షలను నెరవేర్చడంలో అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ రెండూ విఫలమయ్యాయి. ఇక.. అధికారం అడ్డం పెట్టుకొని బీజేపీ చేస్తున్న అరాచకాలను మీరు చూస్తూనే ఉన్నారు. అమర వీరుల ఆశయాల సాధనే ధ్యేయంగా నేను పార్టీ పెడుతున్నాను. చూస్తూనే ఉండండి. నేను కచ్చితంగా ముఖ్యమంత్రిని అవుతానని కవిత ధీమా వ్యక్తం చేశారు.
గొప్ప లక్ష్యంతో పార్టీ పెడుతున్నా
ఇటీవలి భేటీలో కవిత వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజాజాగృతి పార్టీ
రేపే ఆవిర్భావం
Kalvakuntla Kavitha | త్రినేత్ర.న్యూస్ : ప్రజా ఆకాంక్షలను నెరవేర్చడంలో అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ రెండూ విఫలమయ్యాయి. ఇక.. అధికారం అడ్డం పెట్టుకొని బీజేపీ చేస్తున్న అరాచకాలను మీరు చూస్తూనే ఉన్నారు. అమర వీరుల ఆశయాల సాధనే ధ్యేయంగా నేను పార్టీ పెడుతున్నాను. చూస్తూనే ఉండండి. నేను కచ్చితంగా ముఖ్యమంత్రిని అవుతా. ఇక నా ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు ఎవరంటారా? ఒకరు మోడీ..రెండు డాడీ. జనంలోకి వెళతా.. ప్రజా సమస్యలపై పోరాడతా. కచ్చితంగా ఎవరూ ఊహించని మార్పు తెస్తా.. అంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కొంతమంది అనుచరులతో భేటీ అయిన ఆమె తన లక్ష్యం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని, మాజీ ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ అని వారికి స్పష్టబరిచారు. కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం కోసం గత కొన్ని రోజులుగా వివిధ సామాజిక వర్గాల వారితో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె.. తన తండ్రే తన ప్రధాన ప్రత్యర్థి అంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
సమస్యలు చెప్పండి.. స్పందిస్తా
ఎక్కడ ఏ సమస్య ఉన్నా చెబితే తాను వెంటనే స్పందిస్తానని కవిత ఈ భేటీలో చెప్పారు. సమాజంలో పలుకుబడి కలిగిన పెద్దలు తాను పెడుతున్న పార్టీకి మద్దతివ్వాలని కోరారు. ఏదైనా నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుదామన్న మంచి లక్ష్యంతో వస్తే తాను పార్టీ నుంచి టికెట్ కూడా ఇస్తానని చెప్పారు. తన పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని తాను సీఎంను కూడా అవుతానని ఆమె విశ్వాసం ప్రకటించారు. ఆర్థిక, రాజకీయ సంపన్నులు తన లాగే.. ప్రజాప్రతినిధి అవుతాననే లక్ష్యంతో పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు.
కొత్త పార్టీ పేరు.. తెలంగాణ ప్రజా జాగృతి
రేపు ఉదయం ఆవిర్భవించనున్న పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి.. అని విశ్వసనీయ సమాచారం. అయితే సోషల్ మీడియాలో రకరకాల పేర్లతో వార్తలు వస్తున్నప్పటికీ అవేవీ నిజం కాదని తెలుస్తున్నది. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతోనే పార్టీ పేరు ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తయ్యిందని ఇదే పేరును అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తున్నది. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఉన్న అద్వయ కన్వెన్షన్ హాల్‌లో శనివారం (ఏప్రిల్ 25) పార్టీ ఆవిర్భావ సదస్సు జరగనున్న విషయం తెలిసిందే.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

BRS Constituency Incharges | 119 నియోజకవర్గాల ఇంచార్జీలు వీరే.. ప్రకటించిన గులాబీ అధినేత కేసీఆర్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



