RTC STRIKE IN TG| ఆర్టీసీ సమ్మె విరమణ.. ఇక రోడ్డెక్కనున్న బస్సులు
3 రోజులుగా సమ్మెతో ెతెలంగాణ (tg) మొత్తాన్ని అతలాకుతలం చేసిన ఆర్టీసీ (rtc) కార్మికులు ..ప్రభుత్వాన్ని ఒప్పించగలిగారు. రెండున్నరేండ్లుగా తమకు సాకారం కాని సమస్యలను సాధించుకున్నారు.
సంక్షిప్త సారాంశం
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రభుత్వం దిగొచ్చింది. వారికి 11 శాతం పీఆర్సీ ప్రకటించింది. గుర్తింపు సంఘాలకు ఎన్నికలు నిర్వహించుకునే అవకాశం ఇచ్చింది. అత్యంత కీలకమైన .. ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియను త్వరలో పూర్తి చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం స్పష్టమైన అధికార ప్రకటన విడుదల చేసింది
-
11 శాతం పీఆర్సీ
-
విలీనం పై కమిటీ
-
గుర్తింపు సంఘాల ఎన్నికలకు ఓకే
-
చర్చలు సఫలం
-
సమ్మె విరమణ
-
సీఎం ఫొటోకు పాలతో అభిషేకాలు చేయండి
త్రినేత్ర.న్యూస్ : ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించారు.దీంతో తక్షణం అన్ని డిపోల ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఈ మేరకు అటు కార్మిక సంఘం నేతల జేఏసీ, ఇటు రాష్ట్ర మంత్రులు సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో ఈ ప్రకటన వెలువడింది. కీలకమైన సమస్యల పరిష్కారం కోసం కార్మిక సంఘాల నేతలు, ప్రభుత్వ అధికారులతో సమన్యవ కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చీఫ్ సెక్రెటరీ ,అధికారుల బృందం ఆర్టీసీ జేఏసీ తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే.
ఆర్థిక ఇబ్బందులున్నా 11 శాతం పీఏసీ
ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఆర్టీసీ లో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అంగీకరిస్తున్నట్లు తెలిపారు. *ఎన్నికల నిర్వహణ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న విలీనం పై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఆర్టీసీ విలీనానికి సంబంధించి అధికారులు,కార్మిక నాయకులతో కలిసి అధికారిక కమిటీ ప్రకటించడం జరిగింది.పీఆర్సీ పై అనేక అంశాలు ఆర్టీసీ ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ వెసులుబాటు ఇరు పక్షాలు అర్థం చేసుకున్న తరువాత ఆర్టీసీ కార్మికులకు 11 శాతం పీఆర్సీ ప్రకటించింది.
మిగతా ఆర్టీసీ సమస్యల పై ఆర్టీసీ యాజమాన్యం ,కార్మిక సంఘాలు చొరవ తీసుకొని పరిష్కారం చేయాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశిస్తున్నాం..అని చెప్పారు.
సీఎం ఫొటోకు పాలతో అభిషేకాలు చేయండి
ప్రభుత్వం నుంచి ఈ నిర్ణయాలు వెలువడిన వెంటనే .. కార్మిక సంఘం తక్షణం మంత్రులు, సీఎంను కొనియాడారు. దాదాపు 11 గంటల పాటు సుదీర్ఘ సమయం పాటు ఓపిగ్గా సమస్యలపై చర్చించి కార్మికుల హామీలన్ని నెరవేరుస్తున్నందుకు వివిధ వర్గాల జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఫొటోలకు పాలతో అభిషేకాలు నిర్వహించాలని యూనియన్ల నేతలు పిలుపునిచ్చారు.
===========================
గత ప్రభుత్వం సమస్యలను పరిష్కరించలేదు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bhatti Vikramarka | బ్యాంకులే రైతుల వద్దకెళ్లి రుణాలు ఇవ్వాలి.. వారి ఆదాయం పెరిగేలా రుణ విధానాలుండాలి
ఆగస్టు 19, 2026

Bhatti Vikramarka | పెట్టుబడిదారులకు తెలంగాణ స్వర్గధామం
ఆగస్టు 18, 2026

Ponnam Prabhakar | ఎలక్ట్రిక్ ఆటోలు నడుపనున్న ఆర్టీసీ.. అది దుష్ప్రచారమేనన్న మంత్రి పొన్నం ప్రభాకర్
ఆగస్టు 17, 2026
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..
- ●Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?
- ●‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..

Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?

‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!

Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..



