Heat Wave | మహబూబ్‌నగర్, భద్రాచలంలో 40 డిగ్రీల ఎండ.. నేడు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Heat Wave | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంపై సూర్యూడు నిప్పులు (Heat Wave) చెరుగుతున్నాడు. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరాయి. హైదరాబాద్‌లోనూ (Hyderabad) 39 డిగ్రీలు దాటింది.
Heat Wave | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంపై సూర్యూడు నిప్పులు (Heat Wave) చెరుగుతున్నాడు. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరాయి. హైదరాబాద్‌లోనూ (Hyderabad) 39 డిగ్రీలు దాటింది. ఉదయం నుంచే సూర్య ప్రతాపం మొదలవుతున్నది. మధ్యాహ్నానికి అది గరిష్ఠానికి చేరుతున్నది. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉక్కపోత కూడా మొదలైంది. దీంతో ప్రజలు అటు ఎండ, ఇటు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. గురువారం ములుగు జిల్లాలో 39 డిగ్రీలు నమోదవగా, శుక్రవారం భద్రాచలం (Bhadrachalam), మహబూబ్‌నగర్‌లో (Mahabubnagar) 40 డిగ్రీల సెల్సీయస్ నమోదయింది. ఆదిలాబాద్, జగిత్యాల జిల్లా ధర్మపురిలో 38.9 డిగ్రీల చొప్పున, హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌లో 37.8, మెహిదీపట్నంలో 37 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హైదరాబాద్‌లో సాధారణం కంటే 2 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భద్రాచలంలో సాధారణంగా 36.3 డిగ్రీలు నమోదు కావాల్సి ఉండగా 3.7 డిగ్రీలు పెరిగింది. అదేవిధంగా మహబూబ్‌నగర్‌లో 36.6 డిగ్రీలకుగాను 3.4, ఆదిలాబాద్‌లో 35.5 డిగ్రీలకు 3.3 డిగ్రీలు అధికంగా రికార్డయింది.
కాగా, ఇప్పటికే ఎండలు తీవ్రంగా ఉండగా రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రత మరింత పెరగనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శని, ఆదివారాల్లో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఎల్లో అలెర్ట్ (Yellow Alert) జారీ చేసింది.
ఇవికూడా చదవండి..
మార్చి 7 శనివారం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
నాకు తోడుగా ఉండేది మీరే - త్రిష ఇన్‌స్టాపోస్ట్ వైరల్
తాజావార్తలు
- ●Naga Durga | నాగదుర్గ తెలుగు మూవీ షూటింగ్ షురూ - ఇడుపు కాయితం రిలీజ్ డేట్ ఇదేనా ?
- ●Meta | మెటా యూటర్న్.. ప్రైవసీ విమర్శలతో ఏఐ ఇమేజ్ ఫీచర్‌కు గుడ్‌బై..
- ●Anesthesia | పెదవి గాయానికి చికిత్స.. మత్తు ఇంజక్షన్ కారణంగా 18 నెలల చిన్నారి మృతి
- ●Spain vs Belgium | 16 ఏళ్ల నిరీక్షణకు తెర.. బెల్జియంను మట్టికరిపించి సెమీస్‌లోకి దూసుకెళ్లిన స్పెయిన్!
- ●EPFO | ఈపీఎఫ్‌వో పాస్‌బుక్ పోర్టల్ మళ్లీ అందుబాటులోకి.. పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేయండి..
- ●Rukmini Vasanth | క్రేజీ కాంబో సెట్ - నితిన్‌కు జోడీగా డ్రాగన్ బ్యూటీ - ప్రొడ్యూసర్‌గా హీరో నాని

Naga Durga | నాగదుర్గ తెలుగు మూవీ షూటింగ్ షురూ - ఇడుపు కాయితం రిలీజ్ డేట్ ఇదేనా ?

Meta | మెటా యూటర్న్.. ప్రైవసీ విమర్శలతో ఏఐ ఇమేజ్ ఫీచర్‌కు గుడ్‌బై..

Anesthesia | పెదవి గాయానికి చికిత్స.. మత్తు ఇంజక్షన్ కారణంగా 18 నెలల చిన్నారి మృతి

Spain vs Belgium | 16 ఏళ్ల నిరీక్షణకు తెర.. బెల్జియంను మట్టికరిపించి సెమీస్‌లోకి దూసుకెళ్లిన స్పెయిన్!






