త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heat Wave | రాబోయే ఏడు రోజుల పాటు రాష్ట్రంలో ఎండ‌ల తీవ్ర‌త ఎక్కువే.. ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావొద్దు

Heat Wave | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఎండ‌లు (Heat Wave) మండిపోతున్నాయి. గ‌త కొన్ని రోజులుగా ఉష్ణోగ్ర‌త‌లు భారీగా న‌మోద‌వుతున్నాయి. రాబోయే ఏడు రోజుల‌ పాటూ రాష్ట్రంలో ఎండ‌ల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది.

D

Telangana | Published On Apr 13, 2026, 10.35 am IST

Heat Wave | రాబోయే ఏడు రోజుల పాటు రాష్ట్రంలో ఎండ‌ల తీవ్ర‌త ఎక్కువే.. ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావొద్దు
Advertisement

Heat Wave | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఎండ‌లు (Heat Wave) మండిపోతున్నాయి. గ‌త కొన్ని రోజులుగా ఉష్ణోగ్ర‌త‌లు భారీగా న‌మోద‌వుతున్నాయి. ఉద‌యం 6 గంట‌ల‌కే సూర్యుడు త‌న ప్ర‌తాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ప్ర‌జ‌లు ఉక్క‌పోత‌కు అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావాలంటేనే జంకుతున్నారు. ఈ నేప‌థ్యంలో రాబోయే ఏడు రోజుల‌ పాటూ రాష్ట్రంలో ఎండ‌ల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది.

ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, మంచిర్యాల‌, క‌రీంన‌గ‌ర్‌, భూపాల‌ప‌ల్లి, ములుగు, న‌ల్గొండ‌, సూర్యాపేట‌, గ‌ద్వాల జిల్లాల్లో ఉష్ణోగ్ర‌త‌లు 42 డిగ్రీల సెల్సియ‌స్ నుంచి 45 డిగ్రీల సెల్సియ‌స్ వ‌ర‌కూ న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో 41 డిగ్రీల సెల్సియ‌స్ నుంచి 43 డిగ్రీల సెల్సియ‌స్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయ‌ని పేర్కొంది. ఇక హైద‌రాబాద్ న‌గ‌రంలో రాబోయే ఏడు రోజుల‌పాటూ నిరంత‌రంగా 40 డిగ్రీల నుంచి 42 డిగ్రీల సెల్సియ‌స్ వ‌ర‌కూ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించింది. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, మ‌ధ్యాహ్న స‌మ‌యాల్లో బ‌య‌ట‌కు వెళ్లొద్ద‌ని ఈ సంద‌ర్భంగా వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. ఇంటి ప‌ట్టునే ఉంటూ శ‌రీరం డీహైడ్రేట్‌కు గురికాకుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని తెలిపింది. దాహం వేయ‌క‌పోయినా త‌గిన‌న్ని నీళ్లు తాగాల‌ని సూచించింది.

Also Read..

శాంతి చ‌ర్చ‌ల ఎఫెక్ట్‌.. భారీగా ప‌త‌న‌మైన స్టాక్ మార్కెట్లు..

నేడు ఉప్ప‌ల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌.. మ‌ధ్యాహ్నం 12 త‌ర్వాత అటువైపు వెళ్లారో ఇక అంతే!

గెలిపించాలని కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డావ్‌.. సీఎం రేవంత్‌పై ఎంఏ ముఖీం ఆగ్ర‌హం

Advertisement
Advertisement