CM Revanth Reddy | తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. కీలక సూచనలు చేసిన సీఎం రేవంత్
CM Revanth Reddy | తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. వాతావరణ శాఖ తీవ్ర వడగాలులపై హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఉత్తర తెలంగాణ జిల్లాల అధికార యంత్రాంగం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
CM Revanth Reddy | తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. వాతావరణ శాఖ తీవ్ర వడగాలులపై హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఉత్తర తెలంగాణ జిల్లాల అధికార యంత్రాంగం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన అన్ని చర్యలు ముందస్తుగా చేపట్టాలని అధికారులకు సూచించిన సీఎం, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు తగినంత నిల్వలో ఉంచాలని పేర్కొన్నారు. తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బకు గురై ఆసుపత్రులకు వచ్చే వారికి వెంటనే వైద్యసేవలు అందించాలని సీఎం స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు తప్ప సాధ్యమైనంత వరకు మధ్యాహ్న వేళల్లో ప్రజలు ప్రయాణాలు చేయవద్దని సీఎం సూచించారు. జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కలెక్టర్లకు తగిన దిశానిర్దేశం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Paradise Review | ప్యారడైజ్ మూవీ రివ్యూ - బానిసత్వంపై పోరాడే ఓ నాయకుడి కథ
- ●DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ
- ●Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!
- ●Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్
- ●Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం
- ●Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా

Paradise Review | ప్యారడైజ్ మూవీ రివ్యూ - బానిసత్వంపై పోరాడే ఓ నాయకుడి కథ

DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ

Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!

Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్




