త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Adilabad | అగ్ని గుండంలా ఆదిలాబాద్.. అత్య‌ధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు..!

Adilabad | రాష్ట్రం నిప్పుల కొలిమిలా త‌యారైంది. మ‌రి ముఖ్యంగా ఉత్త‌ర తెలంగాణ‌లోని ఆదిలాబాద్ జిల్లా అగ్నిగుండాన్ని త‌ల‌పిస్తోంది. ఉత్త‌ర తెలంగాణ జిల్లాల్లో 44 డిగ్రీల‌కు పైగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కాగా, ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం 44.5 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదైన‌ట్లు హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది.

S

Telangana | Published On May 19, 2026, 5.41 pm IST

Adilabad | అగ్ని గుండంలా ఆదిలాబాద్.. అత్య‌ధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు..!
Advertisement

Adilabad | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రం నిప్పుల కొలిమిలా త‌యారైంది. మ‌రి ముఖ్యంగా ఉత్త‌ర తెలంగాణ‌లోని ఆదిలాబాద్ జిల్లా అగ్నిగుండాన్ని త‌ల‌పిస్తోంది. ఉత్త‌ర తెలంగాణ జిల్లాల్లో 44 డిగ్రీల‌కు పైగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కాగా, ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం 44.5 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదైన‌ట్లు హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. ఇది సాధార‌ణం కంటే 1.8 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌ల కంటే ఎక్కువ‌.

నిజామాబాద్ జిల్లాలో 44.2, మెద‌క్ జిల్లాలో 42.2, న‌ల్ల‌గొండ జిల్లాలో 41.5 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో రాజేంద్ర‌న‌గ‌ర్ ప్రాంతంలో అత్య‌ధికంగా 40 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. బేగంపేట‌లో 39.9 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోదైన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు.

మ‌రింత పెర‌గ‌నున్న ఎండ‌ల తీవ్ర‌త‌

బుధ‌వారం నుంచి ఎండ‌ల తీవ్ర‌త మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. బుధ‌, గురువారాల్లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. వచ్చే నాలుగైదు రోజులు ఉత్తర తెలంగాణలో వడ గాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement