Traffic Restrictions | నేడు ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్.. మధ్యాహ్నం 12 తర్వాత అటువైపు వెళ్లారో ఇక అంతే!
Traffic Restrictions | హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో (Uppal Stadium) ఐపీఎల్ మ్యాచ్ (IPL 2026) జరుగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ (SRH vs RR) మధ్య మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది.
Traffic Restrictions | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో (Uppal Stadium) ఐపీఎల్ మ్యాచ్ (IPL 2026) జరుగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ (SRH vs RR) మధ్య మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. దీంతో స్టేడియం పరిసర ప్రాంతాల్లో వాహనాల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్టేడియం పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 గంటల వరకు ఆంక్షలు, వాహనాల దారిమళ్లింపులు ఉంటాయని చెప్పారు. ఈ సమయంలో ఉప్పల్ జంక్షన్ వైపు భారీ వాహనాలు రాకూడదని, వరంగల్ - హైదరాబాద్ మధ్య ప్రయాణించే భారీ వాహనాలు ఘట్‌కేసర్ వద్ద ఓఆర్ఆర్ నుంచి వెళ్లాలని సూచించారు.
నాగోల్-హబ్సిగూడ, బోడుప్పల్-అంబర్‌పేట మార్గంలో రద్దీ అధికంగా ఉంటుందని, వాహనదారులు ఎల్బీనరగ్, నాచారం, ఎన్ఎఫ్‌సీ, ఓఆర్ఆర్ నుంచి వెళ్లాలని తెలిపారు. ఘట్‌కేసర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే హెవీ వాహనాలు నాగోల్, ఎల్‌బీనగర్ వైపు మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రేక్షకుల కోసం స్టేడియం పరిసరాల్లో 5 ప్రధాన పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. సాధారణ ప్రజలకు స్టేడియం బయట పెంగ్విన్, టీజీఐఏఎల్ఏ, డీఎస్ఎల్ ఓపెన్ ఏరియా, మోడ్రన్ బేకరి వద్ద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయగా, వీఐపీలు, వీవీఐపీలకు స్టేడియం లోపల ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. స్టేడియానికి వచ్చేవారు మెట్రో, ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
🚨 Traffic Advisory 🚨
In view of #IPL2026 match (#SRHvsRR) at Uppal Stadium on 13-04-2026, traffic congestion is expected from 12:00 hrs to 24:00 hrs at Uppal Junction and surrounding routes (Nagole–Habsiguda & Boduppal–Amberpet). Heavy vehicle diversions are in place;… pic.twitter.com/z9hke0Li9a
— Malkajgiri Police (@MalkajgiriCop) April 12, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




