Revanth Reddy | గెలిపించాలని కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డావ్.. సీఎం రేవంత్‌పై ఎంఏ ముఖీం ఆగ్రహం
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ నిర్మాణాలు జరిపిన ఓ గెస్ట్ హౌస్‌తో పాటు ఆరు అంతస్తుల భవనాన్ని హైడ్రా నేలమట్టం చేసింది. ప్రభుత్వ భూమి స్వాధీనం, గెస్ట్‌హౌజ్, అపార్ట్‌మెంట్ కూల్చివేతలు, సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై బీఆర్‌ఎస్ నేత, న్యాయవాది ఎంఏ ముఖీం (MA Mukheem) ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసిన సమయంలో పాత పరిచయంతో రేవంత్ తన ఇంటికి వచ్చాడని, కాళ్లు పట్టుకుని గెలిపించాలని ప్రాధేయపడిన విషయం నిజం కాదా? అని ప్రశ్నించారు. `నా ఇంట్లో భోజనం చేసి, నీళ్లు తాగి నాకే ద్రోహం చేస్తావా` అని ధ్వజమెత్తారు. తాతముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేయడం ఎంతవరకు సమంజసమన్నారు. కేవలం కక్షపూరితంగా తనను వేధిస్తున్నారని ఆరోపించారు.

ఐలాపురం గ్రామంలో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వానికి చెందిన భూమి ఉంది. ఇందులో ఇప్పటికే చాలా నివాసాలు వెలిశాయి. ఇండ్ల జోలికి వెళ్లకుండా, మిగిలి ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమిలో కట్టడాలు, ఆక్రమణలను హైడ్రా తొలగించింది. అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని హైడ్రా నేలమట్టం చేసింది. శనివారం ఉదయం 6 గంటలకు చేపట్టిన ఈ భారీ ఆపరేషన్‌లో 300 మంది హైడ్రా, పోలీసులు పాల్గొన్నారు. 863 ఎకరాల భూమి విలువ రూ.15 వేల కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

Revanth Reddy | కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం కావాలి: సీఎం రేవంత్
మే 21, 2026

CM Revanth Reddy | తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. కీలక సూచనలు చేసిన సీఎం రేవంత్
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



