Harish Rao | సీఎం రేవంత్.. రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటే ఎందుకు అంత చిన్న చూపు: హరీశ్ రావు
Harish Rao | రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటే ఎందుకు అంత చిన్న చూపని సీఎం రేవంత్ రెడ్డిని (Revanth Reddy) బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. సుదీర్ఘ కాలం ప్రభుత్వ ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా సేవలందించి, రిటైర్డ్ అయ్యాక బెనిఫిట్స్ (Retirement Benefits) ఇవ్వకుండా కర్కశంగా వ్యవహరిస్తుండటం దుర్మార్గమని విమర్శించారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్: రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటే ఎందుకు అంత చిన్న చూపని సీఎం రేవంత్ రెడ్డిని (Revanth Reddy) బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. సుదీర్ఘ కాలం ప్రభుత్వ ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా సేవలందించి, రిటైర్డ్ అయ్యాక బెనిఫిట్స్ (Retirement Benefits) ఇవ్వకుండా కర్కశంగా వ్యవహరిస్తుండటం దుర్మార్గమని విమర్శించారు. తమ హక్కుల కోసం ప్రభుత్వాన్ని వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటం దురదృష్టమని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుతో బెనిఫిట్స్, పెన్షన్ బకాయిలు రాక మనోవేదనకు గురై ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా, వందల సంఖ్యలో అనారోగ్యం పాలై ఆసుపత్రుల చుట్టు తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వచ్చే బడ్జెట్ సమావేశాల్లో రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు, చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరుతూ తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు హరీశ్ రావును కలిసి వినతి పత్రం అందచేశారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా మోసం చేసిందని వివరించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. హక్కుగా రావాల్సిన బెనిఫిట్స్ కోసం విశ్రాంతి తీసుకునే సమయంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ వేదనకు గురవుతున్నారని చెప్పారు. బకాయిలు చెల్లించే వరకు ప్రభుత్వాన్ని వదిలి పెట్టబోమని, రిటైర్డ్ ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా అంటుందని, అసెంబ్లీ వేదికగా నిలదీస్తామని భరోసా ఇచ్చారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించకపోవడానికి కారణం డబ్బులు లేక కాదని, ముఖ్యమంత్రికి మనసు రాక అని విమర్శించారు.
మూసీ బ్యూటిఫికేషన్ కోసం లక్షన్నర కోట్లు, ఫ్యూచర్ సిటీ కోసం లక్ష కోట్లు, అందాల పోటీల కోసం వందల కోట్లు, తన సోకుల కోసం నిర్వహించే ఫుట్‌బాల్ మ్యాచ్‌కు రూ.100 కోట్లు, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కోసం వందల కోట్లు, వివిధ రాష్ట్రాల్లో వందల కోట్లతో పత్రిక ప్రకటనలు ఇచ్చే రేవంత్ రెడ్డి, రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించక పోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.98 వేల కోట్లకు టెండర్లు పిలిచారని, బడా కాంట్రాక్టర్లకు రూ.40 వేల కోట్లు చెల్లించారని, కానీ ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలు, బెనిఫిట్స్ కోసం మాత్రం డబ్బులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కమీషన్లు రావు కాబట్టి వీరికి బకాయిలు చెల్లించడం లేదని ఆరోపించారు. వెంటనే రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇవికూడా చదవండి..
లాక్‌డౌన్‌ను గుర్తు చేస్తున్న ఎల్పీజీ కొరత.. ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్న కార్మికులు
బీఫాం వెనక్కి తీసుకున్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇరాన్ కీలక ప్రకటన.. యుద్ధం ముగింపునకు మూడు షరతులు
బిగ్ రిలీఫ్.. హర్మూజ్ గుండా భారత నౌకల ప్రయాణానికి ఇరాన్ అనుమతి
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



