త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Peddi Movie | పెద్ది వ‌స్తుందా? …వాయిదా? – రామ్‌చ‌ర‌ణ్ మూవీ రిలీజ్‌పై డైల‌మా

రామ్‌చ‌ర‌ణ్ పెద్ది మూవీ మ‌రోసారి పోస్ట్‌పోన్ కానున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ఓ సారి వాయిదాప‌డ్డ ఈ సినిమా ఏప్రిల్ 30న కూడా థియేట‌ర్ల‌లోకి రావ‌డం అనుమాన‌మేన‌ని అంటున్నారు. జూన్ 26న పెద్ది రిలీజ‌య్యే అవ‌కాశం ఉందంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి.

N

News | Published On Mar 31, 2026, 10.06 am IST

Peddi Movie | పెద్ది వ‌స్తుందా? …వాయిదా? – రామ్‌చ‌ర‌ణ్ మూవీ రిలీజ్‌పై  డైల‌మా
Advertisement

Peddi Movie | రామ్‌చ‌ర‌ణ్ పెద్ది మూవీ మ‌రోసారి వాయిదాప‌డ‌నున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ఓ సారి వాయిదాప‌డ్డ ఈ సినిమా ఏప్రిల్ 30న కూడా థియేట‌ర్ల‌లోకి రావ‌డం డౌటేన‌ని అంటున్నారు. కానీ మేక‌ర్స్ నుంచి మాత్రం ఈ పోస్ట్‌పోన్‌కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రాలేదు.

మార్చి 27నే రావాల్సింది....కానీ...

స్పోర్ట్స్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న పెద్ది సినిమాను రామ్‌చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మార్చి 27న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ఏడాది క్రిత‌మే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కానీ షూటింగ్‌, పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ ప‌నుల డిలే వ‌ల్ల సినిమాను ఇటీవ‌లే ఏప్రిల్ 30కి వాయిదావేశారు. ఈ పోస్ట్‌పోన్‌తో మేక‌ర్స్‌పై చాలానే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. రిలీజ్‌కు ఇంకో నెల రోజులు మాత్ర‌మే టైమ్ ఉంది. కానీ ఇప్ప‌టికీ రెండు పాట‌లు బ్యాలెన్స్‌గా ఉన్నాయ‌ట‌. పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా ఏప్రిల్ 30లోపూ పూర్తికావ‌డం అసంభ‌వ‌మేన‌ని అంటున్నారు. క్వాలిటీ విష‌యంలో కాంప్ర‌మైజ్ కాకూడ‌ద‌నే ఆలోచ‌న‌తోనే మ‌రోసారి ఈ సినిమాను వాయిదావేయ‌డ‌మే మంచిద‌నే ఆలోచ‌న‌లో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఎస్‌కేఎన్ కామెంట్స్‌...

పెద్ది మూవీ రిలీజ్ ఏప్రిల్ నుంచి జూన్ నెల‌కు మారే అవ‌కాశం ఉంద‌ని టాక్ వినిపిస్తోంది. చెన్నై ల‌వ్‌స్టోరీ ఈవెంట్‌లో పెద్ది మూవీ జూన్ 26న థియేట‌ర్ల‌లోకి రాబోతున్న‌ట్లు నిర్మాత ఎస్‌కేఎన్ ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఎస్‌కేఎన్ కామెంట్స్‌తో సినిమా వాయిదాప‌డ‌టం క‌న్ఫామ్ అంటూ ఫ్యాన్స్ ఫిక్స‌య్యారు. త‌న కామెంట్స్‌పై ట్రోల్స్ రావ‌డంతో ఎస్‌కేఎన్ వెన‌క్కిత‌గ్గారు. పెద్ది మేక‌ర్స్ కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశార‌నుకొని పొర‌పాటుగా జూన్ 26 అన్నానంటూ త‌న కామెంట్ల‌పై క్లారిటీ ఇచ్చారు.

పాన్ ఇండియ‌న్ ప్ర‌మోష‌న్స్‌...

పెద్ది పోస్ట్‌పోన్‌పై ఒక‌టి ఇవాళో రేపో క్లారిటీ రానున్న‌ట్లు స‌మాచారం. జూన్ 26కు రావ‌డ‌మే బెట‌ర్ అనే ఆలోచ‌న‌లో మేక‌ర్స్ ఉన్నార‌ట‌. భారీగానే స్పాన్ ఉన్న క‌థ ఇది. క్రికెట్ మ్యాచ్‌ల‌కు సంబంధించిన వీఎఫ్ఎక్స్ ప‌నులు చాలానే పెండింగ్‌లో ఉన్నాయ‌ట‌. వాటిని తూతూ మంత్రంగా పూర్తిచేస్తే మొద‌టికే మోసం వ‌స్తుంది. మ‌రోవైపు తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో ఒకే సారి రిలీజ్ కాబోతుంది. ఈ పాన్ ఇండియ‌న్ ప్ర‌మోష‌న్స్‌కు ఏప్రిల్ 30 అయితే టైమ్ స‌రిపోదు. వీట‌న్నింటిని దృష్టిలో పెట్టుకొని రెండోసారి సినిమాను వాయిదావేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.
పెద్ది మూవీలో జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో శివ‌రాజ్‌కుమార్‌, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement