త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fire Accident | పాత‌బస్తీలో భారీ అగ్నిప్ర‌మాదం

Fire Accident | హైద‌రాబాద్‌ పాతబస్తీలోని మదీనా చౌరస్తాలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభ‌వించింది. ఎస్‌వైజే కాంప్లెక్స్‌లోని వస్త్ర దుకాణంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దుకాణాలు తెరవకముందే అగ్ని ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం తప్పింది.

S

Hyderabad | Published On May 21, 2026, 12.05 pm IST

Fire Accident | పాత‌బస్తీలో భారీ అగ్నిప్ర‌మాదం
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌ పాతబస్తీలోని మదీనా చౌరస్తాలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభ‌వించింది. ఎస్‌వైజే కాంప్లెక్స్‌లోని వస్త్ర దుకాణంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు తీవ్ర‌ భయాందోళనకు గురయ్యారు. వంద‌ల దుకాణాలు ఉన్న ఈ కాంప్లెక్స్‌లో కాసేపు మంట‌లు ఎగిసిప‌డ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 8 ఫైరింజన్లతో మంటలు ఆర్పివేశారు.

ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంద‌ని పోలీసులు చెప్పారు. దుకాణాలు తెరవకముందే అగ్ని ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం తప్పిందని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా హైద‌రాబాద్‌లో ఇటీవ‌ల త‌ర‌చూ ఏదో ఒక‌చోట అగ్ని ప్ర‌మాదాలు చోటుచేసుకుంటుండ‌డంతో న‌గ‌ర‌వాసులు భ‌యభ్రంతుల‌కు గుర‌వుతున్నారు.

Advertisement
Advertisement