Copilot Plus PC | కోపైలట్ ప్లస్ పీసీ అంటే ఏమిటి.. సాధారణ పీసీలకు, వీటికి తేడా ఏంటి..?
Copilot Plus PC | టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ కృత్రిమ మేధస్సు (ఏఐ)ని రోజువారీ కంప్యూటింగ్‌లో మరింతగా భాగం చేస్తోంది. ఇప్పటికే విండోస్‌లో లోతుగా కలిసిపోయిన కోపైలట్ అసిస్టెంట్ ఇప్పుడు చాలా ఆధునిక విండోస్ ల్యాప్‌టాప్‌లలో అందుబాటులో ఉంది. అయితే ప్రతి విండోస్ ల్యాప్‌టాప్‌కు కోపైలట్ ప్లస్ పీసీ గుర్తింపు లభించదు. కోపైలట్ ప్లస్ పీసీగా అర్హత సాధించాలంటే మైక్రోసాఫ్ట్ నిర్దేశించిన ప్రత్యేక హార్డ్‌వేర్ ప్రమాణాలు ఉండాలి.
Technology | Published On Jun 5, 2026, 2.10 pm IST
Copilot Plus PC | టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ కృత్రిమ మేధస్సు (ఏఐ)ని రోజువారీ కంప్యూటింగ్‌లో మరింతగా భాగం చేస్తోంది. ఇప్పటికే విండోస్‌లో లోతుగా కలిసిపోయిన కోపైలట్ అసిస్టెంట్ ఇప్పుడు చాలా ఆధునిక విండోస్ ల్యాప్‌టాప్‌లలో అందుబాటులో ఉంది. అయితే ప్రతి విండోస్ ల్యాప్‌టాప్‌కు కోపైలట్ ప్లస్ పీసీ గుర్తింపు లభించదు. కోపైలట్ ప్లస్ పీసీగా అర్హత సాధించాలంటే మైక్రోసాఫ్ట్ నిర్దేశించిన ప్రత్యేక హార్డ్‌వేర్ ప్రమాణాలు ఉండాలి. ముఖ్యంగా కనీసం 40 టాప్స్ (TOPS) ఏఐ పనితీరు అందించే ప్రత్యేక న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (ఎన్‌పీయూ) ఉండాలి. దీంతో క్లౌడ్‌పై పూర్తిగా ఆధారపడకుండా ల్యాప్‌టాప్‌లోనే అధునాతన ఏఐ పనులను వేగంగా, సమర్థవంతంగా నిర్వహించవచ్చు.
ఈ కాన్ఫిగరేషన్ అవసరం..
కోపైలట్ ప్లస్ పీసీ పలు ముఖ్యమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ప్రత్యేక ఏఐ హార్డ్‌వేర్‌గా ఎన్‌పీయూ ఉంటుంది. కనీసం 40 ప్లస్ టాప్స్ ఏఐ ప్రాసెసింగ్ సామర్థ్యం అవసరం అవుతుంది. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. డివైస్‌లోనే ఏఐ ఫీచర్లను అమలు చేయడంపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. సాధారణ ల్యాప్‌టాప్‌లతో పోలిస్తే మెరుగైన బ్యాటరీ లైఫ్ ను ఇస్తాయి. క్వాల్‌కామ్, ఏఎండీ, ఇంటెల్ వంటి చిప్ తయారీదారుల ప్రాసెసర్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, కంటెంట్ క్రియేటర్లు, సాధారణ వినియోగదారులు లక్ష్యంగా ఈ ల్యాప్ టాప్‌లను మార్కెట్‌లో ప్రవేశపెడుతున్నారు. కోపైలట్ ప్లస్ పీసీలు మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టిన ప్రత్యేక ల్యాప్‌టాప్‌ల విభాగం కాగా ఇవి ఏఐ ఆధారిత పనులను వేగంగా, తక్కువ విద్యుత్ వినియోగంతో నిర్వహించేందుకు ప్రత్యేక హార్డ్‌వేర్‌ను కలిగి ఉంటాయి. ఈ గుర్తింపు పొందాలంటే ల్యాప్‌టాప్‌లో కనీసం 40 టాప్స్ ఏఐ పనితీరు అందించే ఎన్‌పీయూ తప్పనిసరిగా ఉండాలి. ఏఐ పనుల సమయంలో మొత్తం సీపీయూపై భారం పడకుండా ఎన్‌పీయూ వాటిని నిర్వహిస్తుంది. దీంతో బ్యాటరీ వినియోగం తగ్గడంతోపాటు పనితీరు కూడా మెరుగుపడుతుంది.
ఎన్‌పీయూ అంటే..
ఎన్‌పీయూ లేదా న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే.. సిస్టమ్-ఆన్-చిప్‌లోని ప్రత్యేక భాగం. దీన్ని ఏఐ సంబంధిత పనులను నిర్వహించేందుకు రూపొందించారు. దీని సామర్థ్యాన్ని టాప్స్‌లో కొలుస్తారు. విండోస్ 11లోని అన్ని అధునాతన ఏఐ ఫీచర్లను ఉపయోగించేందుకు కనీసం 40 టాప్స్ అవసరం. ఈ స్థాయి శక్తి ఉండటం వల్ల అనేక ఏఐ పనులను ఆన్‌లైన్ సర్వర్ల సహాయం లేకుండానే ల్యాప్‌టాప్‌లోనే నిర్వహించవచ్చు. ఇలాంటి పీసీల్లో ఫొటోస్ యాప్‌ను వాడడం చాలా తేలికవుతుంది. ఏఐ సహాయంతో చిత్రాల్లోని వస్తువులను సులభంగా గుర్తించవచ్చు. బ్యాక్ గ్రౌండ్‌ను తొలగించడం, చిత్రాల నుంచి టెక్స్ట్ తీసుకోవడం, ఇమేజ్ అప్‌స్కేలింగ్, జనరేటివ్ ఇమేజ్ ఫీచర్లు లభిస్తాయి. అలాగే క్లిక్ టు డూ ఫీచర్ ద్వారా స్క్రీన్‌పై ఉన్న టెక్స్ట్, చిత్రాలను గుర్తించవచ్చు. కంటెంట్ సారాంశాలు తయారు చేయడం, టెక్స్ట్ రూపొందించడం చేయవచ్చు. అలాగే లైవ్ క్యాప్షన్స్ సహాయంతో వీడియోలకు రియల్ టైమ్ క్యాప్షన్లు సృష్టించడం, పూర్తిగా డివైస్‌లోనే పనిచేయడం చేయవచ్చు.

ఏమేం చేయవచ్చు..
నోట్‌ప్యాడ్ సహాయంతో టెక్స్ట్ రూపొందించడం, వాక్యాలను తిరిగి రాయడం వంటి పనులను చేయవచ్చు. అలాగే సెట్టింగ్స్ యాప్ లో వినియోగదారుడి ప్రశ్నలను అర్థం చేసుకుని సంబంధిత సెట్టింగ్స్‌ను సూచించడం చేస్తుంది. ఈ ఫీచర్లన్నీ శక్తివంతమైన ఎన్‌పీయూ కారణంగానే సాధ్యమవుతాయి. అదే సమయంలో బ్యాటరీ లైఫ్ కూడా మెరుగ్గా ఉంటుంది. అయితే ఇలాంటి పీసీలు సాధారణ పీసీల కన్నా వేగంగా ఉంటాయా అని చాలా మంది సందేహిస్తుంటారు. కానీ ఇందుకు సమాధానం యూజర్ చేసే పనులపై ఆధారపడి ఉంటుంది. వెబ్ బ్రౌజింగ్, వీడియో స్ట్రీమింగ్, డాక్యుమెంట్లు తయారు చేయడం, ఈమెయిల్స్ చెక్ చేయడం వంటి సాధారణ పనుల్లో పెద్ద తేడా కనిపించదు. అయితే ఏఐ ఫీచర్ల విషయంలో కోపైలట్ ప్లస్ పీసీలకు స్పష్టమైన ఆధిక్యం ఉంటుంది. ఇమేజ్ జనరేషన్, లైవ్ ట్రాన్స్‌లేషన్, ఏఐ ఆధారిత ఎడిటింగ్, స్మార్ట్ సెర్చ్ వంటి పనులు మరింత వేగంగా పూర్తవుతాయి. క్రియేటివ్ అప్లికేషన్లు, ప్రొడక్టివిటీ టూల్స్ లేదా ఏఐ సాఫ్ట్‌వేర్‌ను తరచూ ఉపయోగించే వారికి ఈ మెరుగుదలలు స్పష్టంగా కనిపిస్తాయి.
అప్‌గ్రేడ్ అవ్వాలా..
ఇప్పటికే ఉన్న సాధారణ పీసీలు లేదా ల్యప్ టాప్‌లను మార్చి కొత్త కోపైలట్ ప్లస్ పీసీలకు అప్ గ్రేడ్ అవ్వాలా.. అని కూడా చాలా మందికి ప్రశ్నలు వస్తుంటాయి. అయితే విద్యార్థులు ఏఐ ఆధారిత నోట్ టేకింగ్, సారాంశాల తయారీ, పరిశోధన సహాయం, భాషా అనువాదం వంటి ఫీచర్లను ఈ ల్యాప్ టాప్‌లతో మరింత మెరుగ్గా ఉపయోగించుకోవచ్చు. అందువల్ల వారు ఆ పీసీలకు అప్ గ్రేడ్ కావచ్చు. ఇక ఉద్యోగులు కూడా స్మార్ట్ మీటింగ్ టూల్స్, ఏఐ ప్రొడక్టివిటీ ఫీచర్లు, మెరుగైన మల్టీటాస్కింగ్ సామర్థ్యాలను పొందవచ్చు. అలాగే కంటెంట్ క్రియేటర్లు ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, డిజైన్ పనుల్లో స్థానికంగా పనిచేసే ఏఐ టూల్స్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఇక తరచూ ప్రయాణించే వారికి ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా అనేక ఏఐ ఫీచర్లను డివైస్‌లోనే పొందవచ్చు. అందువల్ల కో పైలట్ ప్లస్ పీసీలకు మారాలా వద్దా అనేది ఎవరి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా వారు నిర్ణయించుకోవాలి. మెరుగైన పనితీరు కావాలనుకుంటే కచ్చితంగా కో పైలట్ ప్లస్ పీసీలను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే రోజువారీ అవసరాలు సజావుగానే పూర్తవుతుంటే కో పైలట్ ప్లస్ పీసీలకు అప్ గ్రేడ్ అవ్వాల్సిన పనిలేదని కూడా చెబుతున్నారు.
సంబంధిత వార్తలు

Windows 11 | మీ విండోస్ ల్యాప్ టాప్ బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రావడం లేదా.. ఈ సెట్టింగ్స్‌ను మార్చండి..
జులై 25, 2026

ASUS | ఆసుస్ నుంచి కొత్త వివోబుక్ ల్యాప్‌టాప్‌లు.. ఏఐ ఫీచర్లకు ప్రత్యేకం..
జులై 11, 2026

Laptop | ఆఫీస్ పనికోసం ఎంట్రీ లెవల్ ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్నారా.. ఈ 5 మోడల్స్‌పై లుక్కేయండి..
జులై 4, 2026
తాజావార్తలు
- ●Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ
- ●criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా
- ●Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట
- ●Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?
- ●Vaddiraju Ravichandra | పరీక్ష అంటే ఏండ్ల కష్టం.. అందుకే ప్రజా పరీక్షల సవరణ బిల్లుకు మద్దతిస్తున్నం
- ●KTR | యువ ఇంజినీర్ల ప్రతిభను క్రిమినల్ వేస్ట్ అని అవమానిస్తారా..? : రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ

criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా

Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట

Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?



