Sama Rammohan Reddy | బీఆర్ఎస్ మాట్లాడడం ప్రాజెక్టును బొందపెట్టినోడే బాధపడ్డట్టు ఉంది: సామ రామ్మోహన్ రెడ్డి
Sama Rammohan Reddy | పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు గురించి బీఆర్ఎస్ మాట్లాడటం, ప్రాజెక్టుని బొందపెట్టినోడే బాధపడ్డట్టు ఉందని టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్స్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకులు సిగ్గులేకుండా మరోసారి తెలంగాణ ప్రజలను అబద్దాలతో ముంచనీకే తయారైండ్రు అని ఫైరయ్యారు.
Sama Rammohan Reddy | త్రినేత్ర.న్యూస్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు గురించి బీఆర్ఎస్ మాట్లాడటం, ప్రాజెక్టుని బొందపెట్టినోడే బాధపడ్డట్టు ఉందని టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్స్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 2015లోనే ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పిన కేసీఆర్ పదేండ్లు ఏడ పండిండు? అని ప్రశ్నించారు. నీటి పారుదల ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలను దోచుకున్న బీఆర్ఎస్ నాయకులు సిగ్గులేకుండా మరోసారి తెలంగాణ ప్రజలను అబద్దాలతో ముంచనీకే తయారైండ్రు అని ఫైరయ్యారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో 90% పనులు పూర్తయ్యాయని మీరు చెప్పుకుంటున్నరు. ఒకసారి వాస్తవ పరిస్థితిని పరిశీలిద్దాం రండి. నార్లాపూర్ కాడ ఏర్పాటు చేయాల్సిన 9 మోటార్లకు, పదేండ్లలో కేవలం ఒక్క మోటారు పెట్టి 90% పూర్తయిందని చెప్పడానికి సిగ్గు అనిపించట్లేదా? పంపిణీ కాలువలు (distributary canals) తవ్వకం పనులు అసలు చేపట్టకుండా మీరు రూ.28,000 కోట్లు ఎవని జోబులో పోసిండ్రు? 90 శాతం పూర్తి చేసినం అని బోగస్ మాటలు చెప్తున్న బీఆర్ఎస్ పదేండ్లల ఈ ప్రాజెక్ట్ కింద ఒక్క ఎకరాకైనా నీళ్లు ఇచ్చిండ్రా? అని నిలదీశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రధాన పనులను వేగవంతం చేస్తూ, భూసేకరణ అడ్డంకులను తొలగిస్తూ మిగిలిన మోటార్లను ఏర్పాటు చేస్తుంటే.. మీరు మాత్రం మీడియాలో నాటకాలు ఆడుతున్నారు. మీ నకిలీ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ల రోజులు ముగిసిపోయినయ్ అని సామ రామ్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

BRSV | పాలిటెక్నిక్ కోర్సులను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర : గెల్లు శ్రీనివాస్ యాదవ్
ఆగస్టు 20, 2026

Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ఆగస్టు 20, 2026

Vemula Prashanth Reddy | ఆర్భాటాలకు వందల కోట్లు.. భీమ్‌గల్ అభివృద్ధికి రూ.20 కోట్లు లేవా?
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Sushmita Konidela | ప్రకాష్‌రాజ్‌తో చిరంజీవి కూతురు తెలుగువెబ్సిరీస్ - సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- ●Bihar Government | ఆ వీడియోలు తీస్తే రూ.లక్ష ప్రైజ్‌మనీ.. ఇన్‌ఫ్ల్యూయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్
- ●Meta | మెటా పాలసీలపై ఓవర్‌సైట్ బోర్డు కీలక సూచనలు.. కొత్త మార్గదర్శకాలు జారీ..
- ●BRSV | పాలిటెక్నిక్ కోర్సులను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర : గెల్లు శ్రీనివాస్ యాదవ్
- ●Talasani Srinivas Yadav | ముఖ్యమంత్రి నోటి దురద తగ్గించుకో : మాజీమంత్రి తలసాని
- ●Mahesh Goud | పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్

Sushmita Konidela | ప్రకాష్‌రాజ్‌తో చిరంజీవి కూతురు తెలుగువెబ్సిరీస్ - సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Bihar Government | ఆ వీడియోలు తీస్తే రూ.లక్ష ప్రైజ్‌మనీ.. ఇన్‌ఫ్ల్యూయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్

Meta | మెటా పాలసీలపై ఓవర్‌సైట్ బోర్డు కీలక సూచనలు.. కొత్త మార్గదర్శకాలు జారీ..

BRSV | పాలిటెక్నిక్ కోర్సులను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర : గెల్లు శ్రీనివాస్ యాదవ్



