TGPSC | మరో 1597 పోస్టులతో నోటిఫికేషన్లు.. సిద్ధమవుతున్న టీజీపీఎస్సీ!
TGPSC | ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ (Congress) అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన కొన్ని నోటిఫికేషన్లను రద్దుచేసి కొత్తగా విడుదల చేసింది.
TGPSC | త్రినేత్ర.న్యూస్: ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ (Congress) అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన కొన్ని నోటిఫికేషన్లను రద్దుచేసి కొత్తగా విడుదల చేసింది. అప్పటికే పోటీ పరీక్షలు పూర్తయి, ఫలితాలు కూడా వెలువడి.. పోస్టింగుల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు నియామక పత్రాలు (Recruitment) అందజేసింది. వాటన్నిటినీ తన ఖాతాలో వేసుకున్నది. కొత్తగా ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయకపోయినా అధికారంలోకి ఏడాదిలోపే 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పుకుని అభాసుపాలయ్యింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండటం, అభ్యర్థులు పోరాటాలకు సిద్ధమవుతుండటంతో ఇకపై వరుసగా నోటిఫికేషన్లు విడుదలచేస్తామని ప్రకటించింది.
ఇందులో భాగంగా రెండు శాఖల్లో 290 పోస్టులతో మూడు నోటిఫికేషన్లు విడుదల చేసింది. అయితే ఇవన్నీ ఇంజినీరింగ్ డిగ్రీ అభ్యర్థులకు సంబంధించనవే కావడంతో సంప్రదాయ డిగ్రీ కోర్సులు చేసిన వారు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో మరికొన్ని ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ప్రక్రియ ప్రారంభించింది. ఇప్పటికే 3 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది.
1500 పోస్టులతో నోటిఫికేషన్లు..
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు. 1800 ఉద్యోగాల నియామకాలకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నెలలోనే నోటిఫికేషన్లు విడుదల అవుతాయని చెప్పారు. ఇందులో ఇప్పటికే 290 పోస్టులతో టీజీపీఎస్స్ నోటిఫికేషన్లు ఇచ్చింది. తాజాగా మరో 1,597 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. వీటిలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు 180, డిప్యూటీ డీఈవో 24, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 1,393 పోస్టులు ఉన్నట్లు తెలుస్తున్నది. ఇకపై ప్రతినెల రెండు, మూడు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
- ●Donald Trump | మోదీ నాకు గుడ్ ఫ్రెండ్.. భారత్తో త్వరలోనే బిగ్ డీల్ : ట్రంప్
- ●Annamalai | జాతీయ పార్టీలపై అన్నామలై సంచలన వ్యాఖ్యలు
- ●Doctors Strike | వైద్యుల సమ్మె.. ప్రభుత్వ దవాఖానల్లో నిలిచిన ఓపీ సేవలు
- ●Ponnam Prabhakar | వాతావరణ మార్పులను తట్టుకునే నగరాన్ని నిర్మిద్దాం: మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు
- ●Rajesh Exports | రూ.15 లక్షల కోట్ల మిస్టరీ.. రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఆదాయం పజిల్.. సెబీ దర్యాప్తుతో గుట్టు రట్టు..
- ●Student Suicide | శ్రీచైతన్య కాలేజీ హాస్టల్లో ఇంటర్ సెకండియర్ విద్యార్థి ఆత్మహత్య.. తల్లిదండ్రులు రాకముందే..

Donald Trump | మోదీ నాకు గుడ్ ఫ్రెండ్.. భారత్తో త్వరలోనే బిగ్ డీల్ : ట్రంప్

Annamalai | జాతీయ పార్టీలపై అన్నామలై సంచలన వ్యాఖ్యలు

Doctors Strike | వైద్యుల సమ్మె.. ప్రభుత్వ దవాఖానల్లో నిలిచిన ఓపీ సేవలు

Ponnam Prabhakar | వాతావరణ మార్పులను తట్టుకునే నగరాన్ని నిర్మిద్దాం: మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు





