Naga Chaitanya | నాగచైతన్య తెలుగు హారర్ వెబ్‌సిరీస్‌కు సీక్వెల్ వస్తోంది – సైలెంట్‌గా దూత 2 లాంఛ్
నాగచైతన్య తెలుగు హారర్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ దూత ఓటీటీ ప్రేక్షకులను మెప్పించింది. దూత వెబ్‌సిరీస్‌కు సీజన్ 2 రాబోతుంది. దూత 2 శుక్రవారం లాంఛ్ అయ్యింది. ఈ సిరీస్ ఓపెనింగ్ ఈవెంట్‌కు నాగార్జున గెస్ట్‌గా హాజరయ్యారు
Entertainment | Published On Jun 5, 2026, 2.10 pm IST
Naga Chaitanya | నాగచైతన్య ప్రధాన పాత్రలో విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన దూత వెబ్ సిరీస్ తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్‌తోనే నాగచైతన్య ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. దూత కాన్సెప్ట్, విక్రమ్ కే కుమార్ టేకింగ్, ట్విస్ట్‌లు, టర్న్‌లతో పాటు జర్నలిస్ట్ పాత్రలో నాగచైతన్య యాక్టింగ్‌కు మంచి పేరొచ్చింది.తెలుగులో వచ్చిన బెస్ట్ వెబ్‌సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ సిరీస్‌లో ప్రియా భవానీ శంకర్, పార్వతి తిరువోతు, ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రల్లో నటించారు.
నాగార్జున గెస్ట్...
తాజాగా దూత వెబ్ సిరీస్‌కు సీజన్ 2 రాబోతుంది. శుక్రవారం దూత 2 పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ లాంఛింగ్ ఈవెంట్‌కు నాగార్జున చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. నాగచైతన్య, ప్రియా భవానీ శంకర్, పార్వతి తిరువోతులపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నాగార్జున క్లాప్ ఇచ్చారు. ఈ ఫొటోలను నాగచైతన్య సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
దూత 2 తానే స్వయంగా నిర్మించబోతున్నట్లు నాగచైతన్య ప్రకటించారు. ఈ వెబ్‌సిరీస్‌తోనే ఫ స్ట్ టైమ్ ప్రొడ్యూసర్‌గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించాడు.
అమెజాన్ ప్రైమ్‌లో...
దూత 1లోని పాత్రలతో పాటు మరికొన్ని కొత్త క్యారెక్టర్లతో సీజన్ 2 సర్‌ప్రైజింగ్‌గా సాగుతుందట. దూతకు కొనసాగింపుగా కాకుండా డిఫరెంట్ కథతో ఈ సీక్వెల్ తెరకెక్కనున్నట్లు సమాచారం. దూత 2 రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం నుంచి మొదలైనట్లు సమాచారం. ఈ ఏడాది చివరలో లేదంటే వచ్చే ఏడాది ప్రథమార్థంలో అమెజాన్ ప్రైమ్‌లో ద్వారా దూత 2 ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
శోభిత గెస్ట్ రోల్....
దూత 2లో నాగచైతన్య భార్య, టాలీవుడ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. చైతూ, శోభిత ఫస్ట్ టైమ్ ఈ సిరీస్‌తోనే జంటగా స్క్రీన్‌పై కనిపించనున్నారట. ఫుల్ లెంగ్త్ కాకుండా గెస్ట్‌గానే శోభిత పాత్ర సాగుతుందని అంటున్నారు.
నాగచైతన్య తెలుగు హారర్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ దూత ఓటీటీ ప్రేక్షకులను మెప్పించింది. దూత వెబ్‌సిరీస్‌కు సీజన్ 2 రాబోతుంది. దూత 2 శుక్రవారం లాంఛ్ అయ్యింది. ఈ సిరీస్ ఓపెనింగ్ ఈవెంట్‌కు నాగా
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sobhita Dhulipala | ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు – ట్రోల్స్‌పై శోభిత ధూళిపాళ రియాక్షన్
మే 31, 2026

Sobhita Dhulipala | థాంక్యూ బంగారం – చైతూ ఎమోషనల్ బర్త్‌డే విషెస్‌కు శోభిత క్యూట్ రిప్లై
మే 31, 2026

Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య
మే 30, 2026
తాజావార్తలు
- ●Manipur Violence | మణిపూర్‌లో మళ్లీ హింస.. గ్రామంపై కాల్పులు, ఇళ్లకు నిప్పు.. ముగ్గురు మృతి
- ●Sai Pallavi | ధనుష్ సినిమాలో సాయి పల్లవి షాకింగ్ రోల్ - లేడీ సింగంగా నాచురల్ బ్యూటీ
- ●Stock Markets | స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో సూచీలు..
- ●Harish Rao vs Revanth Reddy | రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతో తెలంగాణ జల హక్కులకే ముప్పు: సీఎంకు హరీశ్ రావు బహిరంగ లేఖ
- ●Hiroshima Delegation | తెలంగాణ అసెంబ్లీని సందర్శించిన హిరోషిమా ప్రతినిధుల బృందం
- ●Trichy East | టీవీకే బిగ్ ట్విస్ట్.. తిరుచ్చి ఈస్ట్ నుంచి రాఘవ లారెన్స్ పోటీ..?

Manipur Violence | మణిపూర్‌లో మళ్లీ హింస.. గ్రామంపై కాల్పులు, ఇళ్లకు నిప్పు.. ముగ్గురు మృతి

Sai Pallavi | ధనుష్ సినిమాలో సాయి పల్లవి షాకింగ్ రోల్ - లేడీ సింగంగా నాచురల్ బ్యూటీ

Stock Markets | స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో సూచీలు..

Harish Rao vs Revanth Reddy | రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతో తెలంగాణ జల హక్కులకే ముప్పు: సీఎంకు హరీశ్ రావు బహిరంగ లేఖ



