త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Induction Stove | ఇండక్షన్‌ స్టవ్‌ వాడకంలో జాగ్రత్తలు తప్పనిసరి

Induction Stove | పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం ఇంధన రంగంపై కూడా పడుతోంది. గ్యాస్‌ సరఫరాపై అనిశ్చితి నెలకొనడంతో ఇళ్లతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా వంటగ్యాస్‌ వినియోగంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల లభ్యత, ధరల పెరుగుదల వంటి అంశాలు వినియోగదారులను ప్రత్యామ్నాయాల వైపు మళ్లిస్తున్నాయి.

S

Lifestyle | Published On Jun 5, 2026, 2.53 pm IST

Induction Stove | ఇండక్షన్‌ స్టవ్‌ వాడకంలో జాగ్రత్తలు తప్పనిసరి
Advertisement

Induction Stove | పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం ఇంధన రంగంపై కూడా పడుతోంది. గ్యాస్‌ సరఫరాపై అనిశ్చితి నెలకొనడంతో ఇళ్లతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా వంటగ్యాస్‌ వినియోగంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల లభ్యత, ధరల పెరుగుదల వంటి అంశాలు వినియోగదారులను ప్రత్యామ్నాయాల వైపు మళ్లిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ కుక్కర్లు, ఇండక్షన్‌ స్టవ్‌ల వినియోగం గణనీయంగా పెరుగుతోంది. విద్యుత్‌ శక్తిని ఉష్ణశక్తిగా మార్చి వేగంగా వంట చేసుకునే సౌకర్యాన్ని ఇండక్షన్‌ స్టవ్‌లు అందిస్తున్నాయి. గ్యాస్‌ సిలిండర్లపై ఆధారపడాల్సిన అవసరం లేకపోవడం, తక్కువ సమయంలో వంట పూర్తిచేయగలగడం, నిర్వహణ సులభంగా ఉండటం వంటి కారణాలతో చాలా మంది వీటిని ఎంచుకుంటున్నారు. అయితే వీటి వినియోగంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అన్ని పాత్ర‌లు సెట్ కావు..

ఇండక్షన్‌ స్టవ్‌లలో సాధారణ స్టవ్‌ల మాదిరిగా అన్ని రకాల పాత్రలను ఉపయోగించలేము. మెటల్‌ ప్యానెల్‌ లేదా ఇండక్షన్‌కు అనుకూలంగా రూపొందించిన పాత్రలను మాత్రమే ఉపయోగించాలి. వంట పూర్తయిన తర్వాత పాత్రలను స్టవ్‌పై నుంచి తీసే ముందు తప్పనిసరిగా స్విచ్‌ను ఆఫ్‌ చేయాలి. ఇలా చేయకపోతే ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. ఇండక్షన్‌ స్టవ్‌లు అధిక ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేస్తాయి. అందువల్ల వాటి సమీపంలో ప్లాస్టిక్‌ వస్తువులు, కాగితాలు లేదా సులభంగా మంటలు అంటుకునే దుస్తులు ఉంచకూడదు. అలాంటి వస్తువులు వేడి కారణంగా దెబ్బతినడమే కాకుండా అగ్ని ప్రమాదాలకు దారితీస్తాయి. వంట చేసే సమయంలో స్టవ్‌పై నీరు లేదా ఇతర ద్రవ పదార్థాలు పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ద్రవాలు లోపలికి చేరితే పరికరం పనితీరు దెబ్బతినడంతో పాటు విద్యుత్‌ సంబంధిత ప్రమాదాలు సంభవించే అవకాశమూ ఉంటుంది. అలాగే స్టవ్‌ను శుభ్రం చేసే సమయంలో తడివ‌స్త్రాలు లేదా నేరుగా నీటిని ఉపయోగించకూడదు. మెత్తటి పొడి వ‌స్త్రంతో మాత్రమే శుభ్రం చేయడం మంచిది.

విద్యుత్ స‌ర‌ఫ‌రా విష‌యంలో..

విద్యుత్‌ సరఫరా విషయంలో కూడా అప్రమత్తత అవసరం. నాణ్యమైన స్విచ్‌బోర్డ్‌ ద్వారా మాత్రమే స్టవ్‌కు విద్యుత్‌ అందేలా చూడాలి. ఎక్స్‌టెన్షన్‌ బాక్స్‌లు లేదా నాసిరకం వైర్ల వినియోగాన్ని పూర్తిగా నివారించాలి. వంట పూర్తైన తర్వాత కేవలం స్విచ్‌ ఆఫ్‌ చేయడమే కాకుండా ప్లగ్‌ను కూడా సాకెట్‌ నుంచి తొలగించడం అలవాటు చేసుకోవాలి. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఇండక్షన్‌ స్టవ్‌ను సురక్షితంగా, దీర్ఘకాలం ఉపయోగించుకోవచ్చు.

Advertisement
Advertisement